E-Paper
Advertisement

PM Modi : దేశ కీర్తిని పెంచారు.. భారత అథ్లెట్లపై మోడీ ప్రశంసలు..

PM Modi : ఈ ఏడాది క్రీడా రంగంలో భారత అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో ప్రధాని క్రీడా రంగం గురించి మాట్లాడుతూ.. భారత క్రీడాకారులపై ప్రశంసలు కురిపించారు. ఆసియా క్రీడలతోపాటు వివిధ టోర్నీలో భారత అథ్లెట్లు సత్తా చాటారని కొనియాడారు. ‘ఈ సంవత్సరం మన అథ్లెట్లు గొప్ప ప్రదర్శన చేశారన్నారు. ఆసియా గేమ్స్‌లో 107 పతకాలు గెలుచుకున్నారన్నారు. ఆసియన్ పారా గేమ్స్‌లో 111 మెడల్స్ సాధించారు.

PM Modi : దేశ కీర్తిని పెంచారు.. భారత అథ్లెట్లపై మోడీ ప్రశంసలు..
Advertisement

PM Modi : ఈ ఏడాది క్రీడా రంగంలో భారత అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో ప్రధాని క్రీడా రంగం గురించి మాట్లాడుతూ.. భారత క్రీడాకారులపై ప్రశంసలు కురిపించారు. ఆసియా క్రీడలతోపాటు వివిధ టోర్నీలో భారత అథ్లెట్లు సత్తా చాటారని కొనియాడారు. ఈ సంవత్సరం మన అథ్లెట్లు గొప్ప ప్రదర్శన చేశారన్నారు. ఆసియా గేమ్స్‌లో 107 పతకాలు గెలుచుకున్నారన్నారు. ఆసియన్ పారా గేమ్స్‌లో 111 మెడల్స్ సాధించారని పేర్కొన్నారు.

వన్డే వరల్డ్ కప్‌లో భారత క్రికెటర్ల ప్రదర్శన అందరి హృదయాలను గెలుచుకుందని మోడీ కొనియాడారు. మహిళల జట్టు అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవడం స్ఫూర్తిదాయకమన్నారు. ఇతర క్రీడల్లోనూ మన ఆటగాళ్లు సాధించిన విజయాలు దేశం కీర్తిని పెంచాయన్నారు. వచ్చే ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌లోనూ సత్తాచాటాలని ఆకాంక్షించారు. దేశం మొత్తం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×