E-Paper
Advertisement

ఉల్లిపాయలు తింటాను.. బుర్ర తినను.. ప్రధాని మోదీ సరదా సంభాషణ

ఉల్లిపాయలు తింటాను.. బుర్ర తినను.. ప్రధాని మోదీ సరదా సంభాషణ
Advertisement

M Modi eating Jhal Muri: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరిన వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక ఆసక్తికర సంఘ‌ట‌న‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల వేడిలో తలమునకలైన ప్రధాని, తన బిజీ షెడ్యూల్ మధ్యలో ఒక సామాన్యుడిలా రోడ్డు పక్కన ఆగి బెంగాలీ స్ట్రీట్ ఫుడ్ ఝాల్ మురీని ఆస్వాదించారు. ఝార్గ్రామ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభను ముగించుకుని హెలిప్యాడ్‌కు వెళ్లే దారిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రచార సభలో ప్రసంగించిన అనంతరం మోదీ కాసేపు విరామం తీసుకున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న దుకాణం వద్ద తన కాన్వాయ్‌ను ఆపాలని సూచించారు. అక్కడ విక్రయిస్తున్న బెంగాలీల ఫేవరెట్ స్నాక్ ‘ఝాల్ మురీ’ని (మరమరాలు, మసాలాలతో చేసే స్నాక్) ఆర్డర్ చేశారు. దుకాణదారుడు తయారు చేసి ఇచ్చిన ఆ స్నాక్‌ను రుచి చూసిన ప్రధాని, దానికి సంబంధించిన డ‌బ్బుల‌ను స్వయంగా తానే చెల్లించారు.

Advertisement

ఈ సందర్భంగా దుకాణదారుడికి, ప్రధానికి మధ్య జరిగిన సంభాషణ అక్కడ నవ్వులు పూయించింది. ఝాల్ మురీ సిద్ధం చేస్తున్న సమయంలో దుకాణదారుడు “సార్, మీరు ఉల్లిపాయలు తింటారా?” అని ప్రధానిని అడిగారు. దానికి మోదీ తనదైన శైలిలో స్పందిస్తూ.. ఉల్లిపాయలు తింటాను కానీ, బుర్ర మాత్రం తినను” అంటూ చమత్కరించారు. ప్రధాని పేల్చిన ఈ జోక్కి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.

కేవలం స్నాక్స్ తినడమే కాకుండా, అక్కడ సమకూడిన స్థానిక మహిళలు, చిన్న పిల్లలు, పార్టీ కార్యకర్తలతో ప్రధాని మోదీ ఎంతో సరదాగా ముచ్చటించారు. వారితో కలిసి ఫోటోలు దిగుతూ, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ‘ఝార్గ్రామ్‌లో ఝాల్‌మురీ బ్రేక్‌’ అంటూ ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రధాని తన ఎక్స్‌ (X) ఖాతాలో పోస్ట్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి.

Advertisement

ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగిస్తూ బెంగాల్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ‘డబుల్ ఇంజిన్’ బీజేపీ ప్రభుత్వం వస్తే మత్స్య రంగానికి భారీ ఊతం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న టీఎంసీ ప్రభుత్వ హయాంలో బంగాళదుంప రైతులు మనుగడ సాగించడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, మరోవైపు ఇసుక మాఫియా మాత్రం అక్రమంగా డబ్బులు కూడబెట్టుకుంటోందని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితిని ఏమాత్రం అంగీకరించబోమని మోదీ స్పష్టం చేశారు.

మెదినీపూర్ సభకు హాజరైన యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ, రికార్డు స్థాయిలో యువత తరలివచ్చి తమ పార్టీని ఆశీర్వదించడం విశేషమని ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ఆరోగ్యం, విద్యా రంగాలకు టీఎంసీ ప్రభుత్వం కనీస ప్రాముఖ్యత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రెండు కీలక రంగాల్లో సమూల మార్పులు తీసుకువచ్చి, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని మోదీ హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు.

Read Also: పాకిస్తాన్ పోలికపై బీజేపీ దిద్దుబాటు చర్యలు: మంత్రి క్షమాపణ..!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×