E-Paper
Advertisement

PM Modi: ఎంపీలతో కలిసి మోదీ లంచ్‌.. ఫొటోలు వైరల్‌..!

PM Modi: ఎంపీలతో కలిసి మోదీ లంచ్‌.. ఫొటోలు వైరల్‌..!
Advertisement

PM Modi with MPs: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం తోటి ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో భోజనం చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రం విడుదల చేసిన శ్వేతపత్రంపై పార్లమెంట్‌లో శుక్రవారం చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అనంతరం పార్లమెంట్‌ ప్రాంగణంలో ఓ అనూహ్య దృశ్యం ఆశ్చర్యానికి గురి చేసింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌ క్యాంటీన్‌లో భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు.

బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలను ప్రధాని నేడు లంచ్‌కు ఆహ్వానించారు. దీనిగురించి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఎంపీలకు ప్రధాని నుంచి ఫోన్‌ వచ్చింది. ‘పదండి.. ఈ రోజు మీకో పనిష్మెంట్‌ ఇస్తాను’ అని మోదీ వారితో నవ్వుతూ సరదాగా అన్నట్లు సమాచారం. అనంతరం ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ పార్లమెంట్‌ క్యాంటీన్‌కు వెళ్లారు.

Advertisement

బీజేపీ ఎంపీలు హీనాగవిత్‌, టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఎల్‌.మురుగన్‌, బీఎస్పీ ఎంపీ రితేశ్‌ పాండే తదితరులు ప్రధానితో కలిసి భోజనం చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ లంచ్‌లో ప్రధాని మోదీ ఎంపీలతో పలు విషయాలపై ముచ్చటించినట్లు సమాచారం.

Read More: నాడు వాజ్ పేయీ.. నేడు మోదీ .. భారత రత్న రికార్డులు..

Advertisement

విదేశీ పర్యటనల విశేషాలు, వ్యక్తిగత విషయాలను మోదీ పంచుకున్నట్లు సమాచారం. తనతో పాటు ఆ ఎంపీల భోజనానికి అయిన ఖర్చును ప్రధానే చెల్లించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×