E-Paper
Advertisement

Bihar Election: ఒకప్పటి ‘జంగిల్ రాజ్’ నుంచి రికార్డు పోలింగ్ వరకు.. బీహార్ గతాన్ని గుర్తుచేసిన ప్రధాని

Bihar Election: ఒకప్పటి ‘జంగిల్ రాజ్’ నుంచి రికార్డు పోలింగ్ వరకు.. బీహార్ గతాన్ని గుర్తుచేసిన ప్రధాని
Advertisement

Bihar Election: బీహార్ ఎన్నికల విజయం అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ విజయాన్ని కేవలం పార్టీ విజయంగా కాకుండా, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరి విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ ఎన్నికలు భారత ఎన్నికల సంఘం (ఈసీ)పై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని ఆయన అన్నారు. “గత కొన్నేళ్లుగా స్థిరంగా అధిక పోలింగ్ శాతం నమోదు కావడం, ముఖ్యంగా అణగారిన, దోపిడీకి గురైన వర్గాలు సైతం అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం ఎన్నికల సంఘం సాధించిన గొప్ప విజయం,” అని మోదీ ప్రశంసించారు.

ఈ సందర్భంగా ప్రధాని బీహార్ గతాన్ని గుర్తుచేసుకుంటూ.. కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ MMCగా మారిపోయింది అని అన్నారు. MMC అంటే ముస్లిం మావోయిస్టు కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కూడా ముంచేస్తుంది అని అన్నారు. ఇతర పార్టీ ఓట్లతో కాంగ్రెస్ బతకాలని ప్రయత్నిస్తుంది అని ఆరోపించారు. “ఒకప్పుడు ఇదే బీహార్ మావోయిస్టు ఉగ్రవాదం కోరల్లో చిక్కుకుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగించాల్సిన దారుణ పరిస్థితులు ఉండేవి. ఆ తర్వాత ఓటు వేయడం కూడా కష్టంగా ఉండేది,” అని ఆయన అన్నారు. ఒకప్పటి ‘జంగిల్ రాజ్’ సమయాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బహిరంగ హింస, బ్యాలెట్ బాక్సుల లూటీలు జరిగేవని ఆయన ప్రస్తావించారు.

Advertisement

అయితే, ఈ ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎలాంటి భయం లేకుండా, పూర్తి ఉత్సాహంతో, ఒక పండుగ వాతావరణంలో ఓటు వేశారని మోదీ హర్షం వ్యక్తం చేశారు. “ఒకప్పుడు హింసకు నిలయంగా ఉన్న అదే బీహార్, ఇప్పుడు శాంతియుతంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు చేస్తోంది. ప్రతి ఒక్కరి ఓటు సక్రమంగా నమోదైంది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వారికి స్వేచ్ఛగా ఓటు వేశారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవం,” అని ప్రధాని పేర్కొన్నారు. ఈ మార్పునకు కారణమైన బీహార్ ప్రజలకు, ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించిన ఈసీకి ఆయన అభినందనలు తెలిపారు.

ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ MMCగా మారిపోయింది అని అన్నారు. MMC అంటే ముస్లిం మావోయిస్టు కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కూడా ముంచేస్తుంది అని అన్నారు. ఇతర పార్టీ ఓట్లతో కాంగ్రెస్ బతకాలని ప్రయత్నిస్తుంది అని ఆరోపించారు.

Advertisement

Read Also: Nitish Kumar: ఈ మున్నాభాయ్ మహా ముదురు.. నితీష్ కుమార్ అలాంటివాడా? మీకు తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×