E-Paper
Advertisement

PM Kisan Beneficiary List: పీఎం కిసాన్ డబ్బులపై అప్డేట్.. జాబితాలో మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

PM Kisan Beneficiary List: పీఎం కిసాన్ డబ్బులపై అప్డేట్.. జాబితాలో మీ పేరు ఇలా చెక్ చేసుకోండి
Advertisement

PM Kisan Beneficiary List: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా రూ.6000 పెట్టుబడి సాయం అందిస్తుంది. మూడు విడతలుగా రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు డిపాజిట్ చేస్తుంది. పీఎం కిసాన్ 22వ విడతపై కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 2026 రైతుల జాబితాను అధికారిక పోర్టల్‌లో అప్‌డేట్ చేసింది.

పీఎం కిసాన్ అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తుంది. పాత లబ్ధిదారులు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు 2026 కొత్త లిస్ట్‌లో మీ పేరు చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ జాబితాలో పేరు ఉంటేనే పీఎం కిసాన్ డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి.

పీఎం కిసాన్ లబ్దిదారు లిస్ట్ లో పేరు చెక్ చేయడం ఎలా?

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ ను ఓపెన్ చేయండి.
  • హోంపేజీలో Beneficiary List ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం పేరును నమోదు చేయండి.
  • అన్ని వివరాలు నమోదు చేసి ‘Get Report’ బటన్ క్లిక్ చేయండి.
  • స్క్రీన్ పై కనిపిస్తున్న జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు లేకపోతే

  • ముందుగా పీఎం కిసాన్ పథకానికి ఇచ్చిన బ్యాంక్ ఖాతాను ఆధార్ తో లింక్ చేసుకోవాలి.
  • మీ పేరుపై భూమి రికార్డులు స్పష్టంగా ఉండాలి.
  • బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి. అలాగే ఎన్పీసీఐ లింక్, డీబీటీ ఎనేబుల్ చేసుకోవాలి.
  • ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి.
Advertisement

పీఎం కిసాన్ 22వ విడతను మార్చి, ఏప్రిల్ నెలల్లో ఖాతాల్లో జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కు ఇటీవల ఓటీపీ ఆధారిత eKYCని
అందుబాటులోకి తెచ్చింది.

Also Read:   రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన చంద్రబాబు

పీఎం కిసాన్ OTP ఆధారిత ఈ-కేవైసీ ఎలా?

  • ఓటీపీ ఆధారిత కేవైసీ పూర్తి చేసేందుకు రైతులు ఆధార్‌తో లింక్ అయిన యాక్టివ్ మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి.
  • పీఎం కిసాన్ వెబ్ సైట్ https://pmkisan.gov.in/ లింక్ పై క్లిక్ చేయండి.
  • హోంపేజీలో e-KYC ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి ఓటీపీని సబ్మిట్ చేయండి. దీంతో e-KYC పూర్తి అవుతుంది.
  • ఓటీపీ ఆధారిత కేవైసీ పూర్తికాకపోతే.. సీఎస్సీ సెంటర్లలో బయోమెట్రిక్ ద్వారా కేవైసీ పూర్తి చేయవచ్చు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×