E-Paper
Advertisement

తెరపైకి మళ్లీ డీలిమిటేషన్.. కొత్త ఫార్ములా దక్షిణాదికి లాభమా? నష్టమా? పార్టీలు ఏమంటున్నాయి?

తెరపైకి మళ్లీ డీలిమిటేషన్..  కొత్త ఫార్ములా దక్షిణాదికి లాభమా? నష్టమా? పార్టీలు ఏమంటున్నాయి?
Advertisement

Delimitation: దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి కొత్తగా తీసుకొచ్చిన ఫార్ములా వల్ల దక్షిణాధి రాష్ట్రాలకు లాభమా? నష్టమా అనేదానిపై రాజకీయ పార్టీలో సందడి మొదలైంది. మరి ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫార్సు ఎవరికి అనుకూలంగా మారనున్నాయి?

తెరపైకి మళ్లీ డీలిమిటేషన్.. ఈసారి కొత్త ఫార్ములా

Advertisement

దేశంలో మళ్లీ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఈసారి దక్షిణాదికి లాభం కలుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం 543 స్థానాల్లో 373 స్థానాలను మార్చకుండా అలాగే ఉంచాలన్నది ప్లాన్. దేశ వ్యాప్తంగా 170 పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని మార్చాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రధానిమంత్రి ఆర్థిక సలహా మండలి కీలకమైన సిఫార్సులు చేసింది.

111 నియోజకవర్గాలను మూడింటిగా విభజించాలని పేర్కొంది. మరో 59 స్థానాలను రెండేసి నియోజకవర్గాలుగా విభజించాలని ప్రస్తావించింది. ​తెలంగాణలో జనాభా ఎక్కువగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్‌‌లను మూడేసి నియోజకవర్గాలు కానున్నాయి. చేవెళ్లను రెండు స్థానాలుగా విడగొట్టే అవకాశం ఉంది.

Advertisement

కొత్త ఫార్ములా దక్షిణాదికి లాభమా? ఒక్కో సీటు మాత్రమే పెంపు

ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వద్దాం. రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నంలను మూడేసి నియోజకవర్గాలుగా విభజించాలన్నది ప్లాన్. మచిలీపట్నం రెండు స్థానాలుగా మార్చే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొత్త ఫార్ములాను అమలు చేయడంవల్ల లోక్‌సభలో దక్షిణ రాష్ట్రాలు-అధిక జనాభా కలిగిన ఉత్తర-పశ్చిమ రాష్ట్రాల సీట్ల వాటా మారకుండా ఉంటుందని ఓ అంచనా.

కొత్త అంచనాల మేరకు తెలంగాణలో 17 నుండి 26 కు లోక్‌సభ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 నుండి 38 పెరగనున్నాయి. కర్ణాటక-28 నుండి 42 సీట్లు, తమిళనాడు-39 నుండి 59కు చేరనుంది. కేరళ-20 నుండి 30 వరకు పెరగనున్నాయి. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల విషయానికి వద్దాం.

ALSO READ: బెంగాల్‌‌లో ఏం జరుగుతోంది? మంటల్లో 4 వేల ఈవీఎంలు, ఎవరి పని? నివేదిక కోరిన సీఈసీ 

మహారాష్ట్ర-48 నుండి 72 సీట్లు, రాజస్థాన్‌- 25 నుండి 38, ఉత్తరప్రదేశ్‌-80 నుండి 120, మధ్యప్రదేశ్‌-29 నుండి 44, గుజరాత్‌-26 నుండి 39, బీహార్‌-40 నుండి 60 వరకు సీట్లు పెరుగుతాయని లెక్కలు చెబుతున్నాయి. ఈ విధంగా చూసినా దక్షిణాది రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రాలకు ఒక్కో సీటు అదనంగా పెరుగుతుంది.

పెద్ద రాష్ట్రాలకు కేవలం ఒక్కసీటు మాత్రమే తగ్గుతుందని కొన్ని పార్టీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.  దీనిపై అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకుని డీలిమిటేషన్‌పై ముందుకు వెళ్లాలని కేంద్రం రెడీ అవుతున్నట్లు సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×