// // IndiGo Flight Passenger: ఇండిగో‌లో చెంప దెబ్బ, మిస్సింగ్ తర్వాత -->
E-Paper
Advertisement

IndiGo Flight Passenger: ఇండిగో‌లో చెంప దెబ్బ తర్వాత పాసింజర్ మిస్సింగ్.. రైలులో ప్రత్యక్షం, ఏం జరిగింది?

IndiGo Flight Passenger: ఇండిగో‌లో చెంప దెబ్బ తర్వాత పాసింజర్ మిస్సింగ్.. రైలులో ప్రత్యక్షం, ఏం జరిగింది?
Advertisement

IndiGo Flight Passenger: ఇండిగో విమానంలో తోటి ప్రయాణికుడు కొట్టిన తర్వాత అదృశ్యమయ్యాడు అస్సాంకి చెందిన యువకుడు హుస్సేన్ అహ్మద్ మజుమ్దార్. చివరకు బర్పేటా రైల్వేస్టేషన్‌లో కనిపించడంతో అతడి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..

శనివారం ముంబై-కోల్‌కతా ఇండిగో విమానం వెళ్లింది. అయితే విమానం లోపల ఓ ప్రయాణికుడ్ని మరో ట్రావెల్ చెంప ఛెళ్లుమనిపించాడు. లోపల ఏం జరిగిందనేది కాసేపు పక్కన పెడదాం. ఆ ప్రయాణికులు నేరుగా అస్సాం వెళ్లాల్సి ఉండగా కోల్‌కతాలో దిగిన తర్వాత కనిపించడం మానేశాడు. దీంతో ఆ యువకుడి బంధులు కంగారుపడ్డారు.

Advertisement

ముంబైలో ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు 32 ఏళ్ల యువకుడు హుస్సేన్ అహ్మద్ మజుమ్దార్ హుస్సేన్. కేన్సర్‌తో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు శనివారం ముంబై నుంచి సిల్చార్‌కు కనెక్టింగ్ ఫ్లైట్‌లో బయలుదేరాడు. అయితే ఇండిగో విమానం కోల్‌కతా వరకు మాత్రమే ఉంది. అక్కడి నుంచి మరో ఫైట్ మీద వెళ్లాల్సి ఉంది.

అస్సాం ఎయిర్‌పోర్టులో కుటుంబసభ్యులు అహ్మద్ కోసం ఎదురు చూశారు. కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. అదే సమయంలో హుస్సేన్‌కు ఫోన్ చేశారు. లిప్ట్ చేయకపోవడంతో అసలు టెన్షన్ మొదలైంది. అయితే కోల్‌కతా ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే అహ్మద్ అక్కడి నుంచి అస్సాంకు రైలులో వెళ్లాడు.

Advertisement

ALSO READ: ఫాస్టాగ్ ఏడాది పాస్.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అక్కడి నుంచి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హుస్సేన్ బర్పేటా రైల్వే స్టేషన్‌లో ఉన్నట్టు సమాచారం రావడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. హుస్సేస్ గురించి కటిగోరా పోలీసులు నోరు విప్పారు. హుస్సేన్ కోల్‌కతాలో రైలు ఎక్కి నేరుగా బర్పేటాకు చేరుకున్నాడని తెలిపారు. సిల్చార్‌కు వెళ్లాడని, నీరసంగా కనిపించడంతో ఆహారం అందించామని తెలిపారు.

చివరకు అదృశ్యమైన హుస్సేన్ కనిపించడంతో కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.  హుస్సేస్ ఫోన్ ముంబైలో పోయింది. విమానం ఎక్కేటప్పుడు టికెట్లు చూపించాడు. ఇంతకీ హుస్సేన్ చెంప దెబ్బ ఎందుకు తిన్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది. విమానం టేకాఫ్ సమయంలో హుస్సేన్‌కు గుండె దడ దడ కొట్టుకుంది. దీంతో భయపడ్డాడు.

విమానం నుంచి దిగిపోవాలని ప్రయత్నించాడు. ఏడుస్తూ విమానం నుంచి దిగిపోవాలని డిసైడ్ అయ్యాడు. ఈలోగా క్యాబిన్ సిబ్బంది ఆయన్ని కూల్ చేసేందుకు సీటు వద్దకు తీసుకెళ్తున్నాడు. ఈలోగా మరో ప్రయాణికుడు రహ్మాన్ తన సీటు నుంచి హఠాత్తుగా లేచి హుస్సేన్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది.

 

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×