E-Paper
Advertisement

Lalith Jha Arrest: పార్లమెంట్ పై దాడి కేసు.. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా అరెస్ట్

Lalith Jha Arrest: పార్లమెంట్ పై దాడి కేసు.. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా అరెస్ట్
Advertisement

Lalith Jha Arrest: పార్లమెంట్‌లో పొగబాంబు దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న ఆరో నిందితుడు అరెస్టయ్యాడు. దాడి వెనుక ఉన్న మాస్టర్‌ మైండ్ లలిత్ ఝా ఢిల్లీలోని ఓ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. అతన్ని స్పెషల్ సెల్‌కు అప్పగించారు పోలీసులు. దాదాపు రెండు రోజుల పాటు పరారీలో ఉన్నారు లలిత్‌ ఝా. పార్లమెంట్ లో ఘటనను వీడియో తీసి అక్కడి నుంచి పారిపోయాడు. బస్సులో రాజస్థాన్‌లోని నాగౌర్ చేరుకున్నాడు. తన ఇద్దరు స్నేహితులను కలుసుకుని , ఒక హోటల్‌లో గడిపాడు. పోలీసులు తన కోసం వెతుకుతుండడంతో అతనే మళ్లీ ఢిల్లీకి వచ్చి లొంగిపోయాడు.

విచారణలో భాగంగా నిందితులు దేశంలోని సమస్యలను ప్రస్తావించారని పోలీసులు తెలిపారు. నిరుద్యోగం గురించి మాట్లాడారని వెల్లడించారు. నిందితులను గురువారం పోలీసులు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. 15 రోజుల కస్టడీ కావాలని పోలీసులు కోరగా 7 రోజుల కస్టడీకి ఇస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు. నిందితులు ఉగ్ర చర్యకు పాల్పడ్డారని పోలీసులు కోర్టుకు తెలిపారు. పక్కా ప్రణాళికతోనే దాడికి పాల్పడ్డారని వివరించారు.

Advertisement

నిందితులపై ఢిల్లీ పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కేసులు పెట్టారు. మరోవైపు భద్రతా వైఫల్యంపై లోక్‌సభ సెక్రటేరియట్‌ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్‌ చేసింది. ఇటు ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

.

Advertisement

.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×