E-Paper
Advertisement

Woman Parents Killed A Person: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. కుమార్తెను ప్రేమించిన యువకుడిని హతమార్చిన తల్లిదండ్రులు

Woman Parents Killed A Person: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. కుమార్తెను ప్రేమించిన యువకుడిని హతమార్చిన తల్లిదండ్రులు
Advertisement

Parents who killed the young man who loved their daughter

Parents who killed the young man who loved their daughter(Today’s news in telugu): ఉత్తర ప్రదేశ్‌లో ఓ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తమ కుమార్తె పెళ్లికి అడ్డపడుతున్న యువకుడిని తల్లిదండ్రుల దారుణంగా చంపేశారు. మృతదేహం కారులో తరలించి దహనం చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో చోటుచేసుకుంది.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హథ్రాస్‌కు చెందిన పుష్పేంద్ర యాదవ్‌ అగ్రలో ఓ ట్రాన్స్‌పోర్టు వ్యాపారిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 20ఏళ్ల డాలీ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారిందది. వారి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో పారిపోయి పెళ్లిచేసుకునేందుకు ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు ఆ సంబంధాలకు అడ్డుపడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రులు అవదేశ్‌, భూరీ దేవి తమ కుమార్తెతో పుష్రేంద్రకు ఫోన్‌ చేయించి ఇంటికి రప్పించారు.

Advertisement

Read More: సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీ.. పీఎం సూర్యఘర్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

ఈ నేపథ్యంలో ఇంకి వచ్చిన పుష్పేంద్రను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. కుటంబసభ్యులతో పాటు ఇతర బంధువులతో కలిసి ప్లాన్‌ ప్రకారం ఇంటికి వచ్చిన ఆ యువకుడిని దారుణంగా చంపేశారు. అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లి దహనం చేశారు.

మథర జిల్లాలో ఈ కాలిపోయిన ఈ కారును పోలీసులు సోమవారం గుర్తించారు. పరిశీలించగా కారులో మృతదేహాన్ని గమనించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈ విషయాలన్ని బయటపడ్డాయి.

పోలీసులు యువతితో పాటు ఇందుకు కారణమైన కుటుంబసభ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తండ్రి అవదేశ్‌ మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దర్యాప్తు వేగంతం చేసి అవదేశ్‌ త్వరలో పట్టుకుంటాం అని సీనియర్‌ సూపరింటెండెంట్‌ శైలేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×