E-Paper
Advertisement

ఎట్టకేలకు పాత పెన్షన్ స్కీమ్.. 22 ఏళ్త తర్వాత ప్రకటన, ఆ ఉద్యోగులు ఫుల్‌ఖుషీ

ఎట్టకేలకు పాత పెన్షన్ స్కీమ్.. 22  ఏళ్త తర్వాత ప్రకటన, ఆ ఉద్యోగులు ఫుల్‌ఖుషీ
Advertisement

Old Pension Scheme-OPS: పాత పెన్షన్ స్కీమ్-OPS పునరుద్ధరించాలని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. 2004 తర్వాత ఉద్యోగంలో చేరినవారికి ప్రత్యేక పరిస్థితుల మేరకు ఓపీఎస్ విధానం వర్తింపచేస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. దీన్ని సీఎస్ఐఆర్ సమర్థించింది. దీంతో ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది.

ఆ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త- దేశవ్యాప్తంగా పాత పెన్షన్ స్కీమ్-OPS పునరుద్ధరించాలని చాన్నాళ్లుగా ఉద్యోగాలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెప్పనక్కర్లేదు. ఆయా ప్రభుత్వాలపై ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్న సందర్భాలు కోకొల్లలు. ఈ క్రమంలో ప్రత్యేక కేటగిరీ కింద ఉద్యోగులకు పెద్ద ఊరట కల్పించింది కేంద్రం.

Advertisement

ఉద్యోగంలో చేరి రెండు దశాబ్దాల తర్వాత వారికి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని డిసైడ్ అయ్యింది. ఆ లెక్కన 2004 ఏడాది జనవరి 1 న నేషనల్ పెన్షన్ సిస్టమ్-NPS అమలులోకి వచ్చింది. అంతకు ముందు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని ఆ తర్వాత జాబ్‌లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ఎంచుకునే ఆప్షన్ ఇచ్చింది.

పాత పెన్షన్ స్కీమ్ విధానం అమల్లోకి- కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థించిన సీఎస్ఐఆర్, ఈ మేరకు మెమోరాండం జారీ చేసింది. మరో విషయం ఏంటంటే.. అదనపు ప్రయోజనం అందరు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. కేవలం ప్రత్యేక కేటగిరీకి చెందిన ఉద్యోగులకు మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే కారుణ్య నియామక ఉద్యోగులకు వర్తిస్తుంది.

Advertisement

ఆ లెక్కన 2003, డిసెంబర్ 12 కంటే ముందు కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నవారు వివిధ కారణాల వల్ల 2004, జనవరి 1 తర్వాత సర్వీసులో చేరినవారికి ఈ అవకాశం దక్కుతుంది. గతంలో వారికి నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలో పెన్షన్ ఇచ్చేవారు. ఈ ఏడాది జూన్ 22న కేంద్రం పెన్షన్ శాఖ ఇచ్చిన లేఖ ఆధారంగా సీఎస్ఐఆర్, ఓపీఎస్ ఎంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

22 ఏళ్ల తర్వాత సీఎస్ఐఆర్ ప్రకటన– నార్మల్‌గా అయితే ఉద్యోగంలో జాయినింగ్ డేట్ ఆధారంగా పెన్షన్ నిర్ణయిస్తారు. ప్రత్యేక నిర్ణయం ప్రకారం ఉద్యోగంలో చేరిన డేట్‌తో సంబంధం లేకుండా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న డేట్ ప్రకారం పాత పెన్షన్ ఎంచుకునేందుకు అవకాశం ఇచ్చింది.

ALSO READ: వాహన యజమానులకు శుభవార్త, తెరపైకి కొత్త ప్రతిపాదనలు, ఇకపై మూడేళ్లు

తాజా ఉత్తర్వుల ప్రకారం 2003 డిసెంబర్ లోపు అపాయింట్మెంట్ ఇచ్చినా ఓపీఎస్ ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో చేరిన సమయంలో కారుణ్య నియామకాల కింద వచ్చినవారికి ఈ తరహా బెనిఫిట్ ఇవ్వలేదు. లేటెస్టుగా పాత పెన్షన్ అవకాశం ఇవ్వడంతో వారికి బిగ్ రిలీఫ్.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×