E-Paper
Advertisement

No Confidence Motion: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. పార్లమెంట్‌లో విపక్షాల పోరు!.

No Confidence Motion: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. పార్లమెంట్‌లో విపక్షాల పోరు!.
Advertisement

No Confidence Motion: ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర విపక్షాలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, స్పీకర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి, కేవలం బీజేపీ ఎజెండాను మాత్రమే నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే తనతో పాటు పలువురు ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారని, దీనికి సంబంధించిన లేఖను రేపు స్పీకర్‌కు అందజేస్తామని ఆయన వెల్లడించారు. సభలో నిబంధనలు పాటించడం లేదని, ప్రతిపక్షాల గొంతు నొక్కేలా స్పీకర్ వ్యవహరిస్తున్నారని మల్లు రవి విమర్శించారు.

చైనా భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్న అంశంపై మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎం.ఎం. నరవణే తన పుస్తకంలో రాసిన విషయాలను రాహుల్ గాంధీ సభలో ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తుంటే బీజేపీ అడ్డుకుంటోందని మల్లు రవి పేర్కొన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఇంతటి కీలక అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదని, కావాలనే మైక్ కట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఇండో-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ మాట్లాడతారనే భయంతోనే ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే 8 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, రాజకీయ లబ్ధి కోసమే సభను సజావుగా సాగనివ్వడం లేదని ఆయన మండిపడ్డారు.

Advertisement

మరోవైపు, అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా సభ జరుగుతున్న తీరుపై విచారం వ్యక్తం చేశారు. తాను ప్రతిపక్ష కూటమిలో భాగం కానప్పటికీ, గత 18 ఏళ్లలో పార్లమెంట్ ఇంత దారుణంగా నడవడం ఎప్పుడూ చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీలను మాట్లాడనివ్వకపోతే, సభ నిర్వహణ కోసం ప్రజల సొమ్మును ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఆమె ప్రభుత్వాన్ని, స్పీకర్‌ను ప్రశ్నించారు. ప్రతిపక్షం మొత్తాన్ని మౌనంగా ఉంచడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.

ఇండో-అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో దేశాన్ని తప్పుదోవ పట్టించారని, ఈ ఒప్పందం దేశ రైతులను నాశనం చేసేలా ఉందని హర్‌సిమ్రత్ కౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టి దేశం అభివృద్ధి చెందలేదని ఆమె హితవు పలికారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు ఇంతటి భారీ పార్లమెంటును ఎందుకు నిర్మించారని ఆమె నిలదీశారు. పార్లమెంట్ నడపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని ఉభయ పక్షాల ఎంపీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Read Also: Rah Veer Scheme: రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు సర్కార్ కీలక నిర్ణయం..?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×