E-Paper
Advertisement

డిసెంబర్ నాటికి టోల్ గేట్లు మాయం.. ఏఐ కెమెరాలతో నిరంతరాయ టోలింగ్: నితిన్ గడ్కరీ

డిసెంబర్ నాటికి టోల్ గేట్లు మాయం.. ఏఐ కెమెరాలతో నిరంతరాయ టోలింగ్: నితిన్ గడ్కరీ
Advertisement

భారతదేశ రవాణా ముఖచిత్రాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తున్న‌ట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్ల‌డించారు. ఢిల్లీలో శుక్ర‌వారం జరిగిన లాజిస్టిక్స్ శక్తి సమిట్ & అవార్డ్స్ 2026లో ప్రసంగిస్తూ, ఈ ఏడాది డిసెంబర్ నాటికి జాతీయ రహదారులపై ఎక్కడా వాహనాలు ఆగాల్సిన అవసరం లేని నిరంతరాయ టోలింగ్ వ్య‌వస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశ లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఉన్నప్పటికీ వాహనాలు ఆగాల్సి వస్తోందని.. కానీ కొత్త వ్యవస్థలో ఏఐ అనలిటిక్స్‌తో కూడిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR), అధిక పనితీరు గల కెమెరాలను ఉపయోగిస్తారని పేర్కొన్నారు. దీనివల్ల వాహనం ప్రయాణిస్తుండగానే ఆటోమేటిక్‌గా ఛార్జీ వసూలు అవుతుంద‌న్నారు గడ్కరీ. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, వారికి వెంటనే ఇ-నోటీసులు జారీ చేస్తారన్నారు. వాటిని సకాలంలో చెల్లించకపోతే సదరు వాహన ఫాస్టాగ్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఇతర జరిమానాలు కూడా విధిస్తార‌ని తెలిపారు.

Advertisement

భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలంటే లాజిస్టిక్స్ ఖర్చును సింగిల్ డిజిట్‌కు (10% కంటే తక్కువకు) తగ్గించుకోవాలని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఐఐటీ, ఐఐఎంల నివేదిక ప్రకారం, గతంలో 16 శాతంగా ఉన్న ఈ వ్యయం ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంతో ఇప్పుడు 10 శాతానికి తగ్గిందని ఆయన ప్రకటించారు. అమెరికా, ఐరోపా దేశాల్లో ఇది 12 శాతంగా ఉండగా, చైనాలో 8-10 శాతంగా ఉందని వివరించారు. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఇది చాలా కీలకమని పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం మన చమురు అవసరాల కోసం 87 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నామని, దీనికోసం ఏటా రూ. 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభం వంటి పరిస్థితుల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండాలంటే.. హరిత హైడ్రోజన్, జీవ ఇంధనాలు, ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని సూచించారు.

Advertisement

భవిష్యత్తులో 100 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని, తద్వారా శిలాజ ఇంధనాల వాడకాన్ని, కాలుష్యాన్ని తగ్గించవచ్చని గడ్కరీ అన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ వాడకంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. ఆటోమొబైల్ కంపెనీలు కూడా కేవలం వాహన ధరల మీదనే కాకుండా, ప్రత్యామ్నాయ ఇంధనాలకు అనుకూలంగా ఉండే నాణ్యమైన ఇంజన్ల తయారీపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘చెత్త నుండి హైడ్రోజన్’ తయారీ వంటి వినూత్న పద్ధతులు భవిష్యత్ భారత్ కు దిక్సూచి అని ఆయన పేర్కొన్నారు.

Read Also: ఏఐ కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా మన ఏపీ.. లింక్డ్‌ఇన్ రిపోర్టులో ఆసక్తికరమైన అంశాలు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×