// // Coimbatore Car Blast : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా పేలుడు పదార్ధాల కొనుగోలు.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Coimbatore Car Blast : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా పేలుడు పదార్ధాల కొనుగోలు..

Coimbatore Car Blast : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా పేలుడు పదార్ధాల కొనుగోలు..
Advertisement

Coimbatore Car Blast : తమిళనాడు కోయంబత్తూర్‌లో కారు బాంబు పేలుడు కేసుతో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. ఈ ఘటనలో పోలీసులు అఫ్సర్ ఖాన్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీం అతన్ని పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. తాజాగా అరెస్ట్ అయిన అఫ్సర్ ఖాన్.. ఈ పేలుడు ఘటనలో మృతి చెందిన ముబిన్ సమీప బంధువుగా పోలీసులు గుర్తించారు. దీంతో… మొత్తం ఆరుగురు పోలీసుల అదపులో ఉన్నారు. అటు ఈ ఘటన వెనుక ఉగ్రకుట్ర ఉందనే అనుమానాలు రావడంతో కేసు దర్యాప్తు కోసం NIA కూడా రంగంలోకి దిగింది.

నిందితుడు అఫ్సర్ ఖాన్.. పేలుడు పదార్ధాలైన పొటాషియం నైట్రేట్, అల్యుమీనియం పౌడర్, సల్ఫర్, చార్కోల్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేవాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి లింక్స్ ఉన్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు సంవత్సరాల ముందే వీరు పేలుడు పదార్ధాలను కొనుగోలు చేసి కోయంబత్తూర్‌లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నారు. అఫ్సర్ ఖాన్ ఇంట్లో పోలీసులు కార్డన్ సర్చ్ చేయగా 75కేజీల పొటాషియం నైట్రట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన అఫ్సర్ ఖాన్ గత పదేళ్లుగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం కొట్టైమెడులోని సంగమేశ్వర్ ఆలయం ముందు కారు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ దుర్ఘటనలో జమీషాముబీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

ఈ కారు బ్లాస్టుకు కేసును కోయంబత్తూర్ పోలీసుల నుంచి తీసుకొని తాము ఇన్వెస్టిగేట్ చేసే ప్లాన్‌లో ఉన్నారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×