E-Paper
Advertisement

Delhi Blast Update: ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో మరో ఉగ్రవాది అరెస్ట్

Delhi Blast Update: ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో మరో ఉగ్రవాది అరెస్ట్
Advertisement

Delhi Blast Update: ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరో ముందడుగు వేసింది. ఈ భయంకరమైన పేలుడులో ప్రమేయమున్న ఉగ్రవాదికి చెందిన మరో ముఖ్య సహచరుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. కాశ్మీరీ నివాసి అయిన జాసిర్ బిలాల్ వానీ అలియాస్ డానిష్‌ను, జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బృందం కాశ్మీర్ లోయలో ఈ అరెస్టును చేసింది.

ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 10 మంది మరణానికి, 32 మంది గాయపడటానికి కారణమైన ఈ దాడికి జాసిర్ “సాంకేతిక సహకారం” (Technical Support) అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రదాడుల కోసం డ్రోన్లను సవరించడం (modifying drones), రాకెట్లను తయారు చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఇతను కుట్రలో చురుకైన పాత్ర పోషించాడు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా ఖాజీగుండ్‌కు చెందిన జాసిర్, ప్రధాన ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీతో కలిసి ఈ దారుణానికి ప్రణాళిక వేశాడు.

Advertisement

ఈ బాంబు పేలుడు వెనుక ఉన్న భారీ కుట్రను పూర్తిగా ఛేదించేందుకు ఎన్ఐఏ వివిధ కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ ఉగ్ర దాడిలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించడానికి పలు రాష్ట్రాల్లో యాంటీ-టెర్రర్ ఏజెన్సీ బృందాలు ఏకకాలంలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

Read Also: Indian Army: ఆపరేషన్‌ సింధూర్‌ 88 గంటల్లో పూర్తైన ట్రైలర్‌ మాత్రమే.. ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×