// // Delhi Rains: పొంగిన యమున, ఫ్లైఓవర్ మధ్య హోల్, ఆటో సేఫ్ -->
E-Paper
Advertisement

Delhi: పొంగిన యమునా నది.. ఫ్లైఓవర్ మధ్య భారీ హోల్, ఆటోకు తప్పిన ప్రమాదం

Delhi: పొంగిన యమునా నది.. ఫ్లైఓవర్ మధ్య భారీ హోల్, ఆటోకు తప్పిన ప్రమాదం
Advertisement

Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో పలు ప్రాంతాలకు నారింజ, పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా జన జీవనం స్తంభించింది.

నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఢిల్లీలోని యమునా నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 207.39 మీటర్లకు నీరు చేరుకుంది. పుష్కరకాలం కిందట అంటే 2013లో 207.32 మీటర్ల మార్క్‌ని అధిగమించింది.

Advertisement

ఢిల్లీ సిటీ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన మూడవ అత్యధిక వర్షపాతంగా నమోదు అయ్యింది. ఇదిలాఉండగా గురువారం ఉదయం ఢిల్లీలో జాతీయ రహదారి-44 లోని అలీపూర్ సమీపంలోని ఫ్లైఓవర్‌లో ఓ భాగం కూలిపోయింది. ఆ సమయంలో ఆటో వెళ్తుండగా భారీ హోల్ పడింది. ఈ ఘటనలో ఆటో ముందు పార్టు డ్యామేజ్ కాగా, డ్రైవర్ కు స్వల్పంగా గాయాలయయాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆటోడ్రైవర్‌ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఫ్లైఓవర్‌పై వాహనాలను నిలిపివేశారు. ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ ఘటన ఉదయం ఎనిమిది గంటల సమయంలో జరిగిందని అంటున్నారు.

Advertisement

ALSO READ: అదిరిపోయే స్కీమ్.. ఇంటర్ పాసైతే చాలు, ఏడాదికి రూ.20 వేలు

ఫ్లైఓవర్ పై రోడ్డు అకస్మాత్తుగా గుంతలు పడి నాలుగు నుంచి ఐదు అడుగుల లోతున గొయ్యి ఏర్పడింది. గుంత చుట్టూ పగుళ్లు కనిపిస్తున్నాయి. ఫ్లైఓవర్ భూమి నుండి 25 నుండి 30 అడుగుల ఎత్తులో ఉంది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

ఇదిలావుండగా ఢిల్లీలో కీలక ప్రాంతాల్లోని ఫ్లైఓవర్లపై తనిఖీలు చేపట్టారు అధికారులు. డ్యామేజ్ అయిన ఫ్లైఓవర్లపై ఇంజనీర్లు విభాగంతో ఆడిట్ నిర్వహించాలని భావిస్తోంది. మరోవైపు సీఎం రేఖాగుప్తా పలు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి బాధితులకు భరోసా ఇచ్చారు. నివాసితులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం యమునా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఓల్డ్ రైల్వే బ్రిడ్జి పై రాకపోకలను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. షెల్టర్‌ల వద్ద సివిల్ డిఫెన్స్ సిబ్బందిని ఢిల్లీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. షెల్టర్లలో ఉండే వరద బాధితులకు సివిల్ డిఫెన్స్ సిబ్బంది దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×