E-Paper
Advertisement

TamilNadu Politics: తమిళనాడులో సేమ్ సీన్.. విజయ్ ప్రభుత్వంపై గవర్నర్ ఆఫీసు క్లారిటీ, మళ్లీ మొదటికి

TamilNadu Politics: తమిళనాడులో సేమ్ సీన్.. విజయ్ ప్రభుత్వంపై గవర్నర్ ఆఫీసు క్లారిటీ, మళ్లీ మొదటికి
Advertisement

TamilNadu Politics: తమిళనాడుకు సీఎం అయ్యే అదృష్టం విజయ్‌కు లేదా? ఆ ఘడియలు ఇంకా రాలేదా? అందుకు కొన్నాళ్లు సమయం పట్టవచ్చా? విజయ్‌కు గ్రహాలు అనుకూలంగా లేవా? ప్రభుత్వం ఏర్పాటుపై గురువారం గవర్నర్ ఏమన్నారు? మీడియా వార్తల నేపథ్యంలో గవర్నర్ ఆఫీస్ అలర్ట్ అయ్యిందా? విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ నిరాకరించారా? అవుననే అంటున్నాయి గవర్నర్ ఆఫీసు వర్గాలు. దీంతో తమిళనాడు కొత్త ప్రభుత్వం వ్యవహారం మొదటికి వచ్చినట్లయ్యింది.

తమిళనాడు రాజకీయాల్లో అదే సీన్ రిపీట్

Advertisement

తమిళనాడులో టీవీకే చీఫ్ అధినేత విజయ్‌కు గ్రహాలు అనుకూలించలేనట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రెండు‌సార్లు గవర్నర్ వద్దకు వెళ్లారు. ఆయన ఎలాంటి మార్పులేదు. సంఖ్యా బలాన్ని చూపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్‌కు గవర్నర్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఓ లేఖ విడుదల చేసింది.

గురువారం ఉదయం మరోసారి టీవీకే చీఫ్ విజయ్.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య ఉందని, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. దానిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేయలేదు.

Advertisement

విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నో పర్మిషన్

మీడియాలో మాత్రం విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారంటూ టీవీల్లో పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్. చివరకు నేషనల్ మీడియాలో కూడా ఈ తరహా వార్తలు వచ్చాయి. పరిస్థితి గమనించిన తమిళనాడు గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గ‌వ‌ర్న‌ర్ నిరాకరించినట్టు అందులో ప్రస్తావించింది.

మెజార్టీ సంఖ్యా బలాన్ని చూపించాలని విజయ్‌ను గవర్నర్ కోరారు. టీవీకే పార్టీకి మద్దతిస్తామని వీసీకే, సీపీఐ సానుకూలంగా స్పందించినా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.  తమిళనాడులో జరుగుతున్న పరిణామాలపై సినీ, సామాన్యులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

ALSO READ: తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై కమల్ హాసన్ ఫైర్!

మెజార్టీని నిరూపించుకోవాల్సి రాజ్‌భవన్‌లో కాదని, అసెంబ్లీలోనని అన్నారు ఎంపీ కమల్ హాసన్. ఇదే విషయాన్ని ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో తమిళనాడు గవర్నర్ ప్రవర్తన అత్యంత అసహ్యకరంగా ఉందని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. గవర్నర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం విజయ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు గవర్నర్‌పై ఒత్తిడి తెస్తున్నారేమోనని అనుమానం ప్రజలకు కలుగుతోందని తమిళనాడు యూత్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కోరింది. ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించకపోతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించింది.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×