E-Paper
Advertisement

Pan New Rules: పాన్ కార్డు రూల్స్ మారుతున్నాయ్.. ఇకపై DoB ప్రూఫ్ గా ఆధార్ కు నో

Pan New Rules: పాన్ కార్డు రూల్స్ మారుతున్నాయ్.. ఇకపై DoB ప్రూఫ్ గా ఆధార్ కు నో
Advertisement

Pan New Rules: ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు దరఖాస్తు నిబంధనలు మారనున్నాయి. పాన్ కార్డు దరఖాస్తు విధానంలో మార్పులు తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు పాన్ కార్డు దరఖాస్తుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకునేవారు. కానీ ఇకపై ఆధార్ కార్డుతో పాన్ కార్డు దరఖాస్తుకు అవకాశం లేదు. మార్చి 31తో ఈ గడువు ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి..కొత్త పాన్ దరఖాస్తు నిబంధనలు.. దరఖాస్తు పత్రాలు, ఫారాలు, మొత్తం దరఖాస్తు ప్రక్రియను ప్రభావితం చేయనున్నాయి.

మార్చి 31 వరకే ఛాన్స్

మార్చి 31, 2026 వరకు ఆధార్ కార్డును ఉపయోగించి పాన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం పాన్ దరఖాస్తును పూర్తి చేయడానికి అత్యంత సులభమైన వేగవంతమైన మార్గం ఇది. కానీ ఈ గడువు ముగిసిన తర్వాత, కొత్త పాన్ దరఖాస్తులకు కేవలం ఆధార్ మాత్రమే సరిపోదని ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు ఆధార్ వివరాలతో పాటు అదనపు గుర్తింపు కార్డులు సమర్పించాల్సి ఉంటుంది.

కొత్త పాన్ అప్లికేషన్

Advertisement

ఏప్రిల్ 1, 2026 తర్వాత పాత పాన్ దరఖాస్తు ఫామ్ లను అంగీకరించరు. కొత్త ఫామ్ లను తీసుకురానున్నారు. వీటిని ఆన్ లైన్ అందుబాటులో ఉంచనున్నారు.
పాన్ కార్డుపై ఉన్న పేరుకు మార్చుకోవడానికి మరో ముఖ్యమైన అప్డేట్ తీసుకురానున్నారు. ఏప్రిల్ నుంచి పాన్ కార్డుపై పేరు ఆధార్ లోని వివరాలతో కచ్చితంగా సరిపోయేలా ఉండాలి.

​ DOB ప్రూఫ్‌గా ఉపయోగించే పత్రాలు

పుట్టిన తేదీ (DoB) వెరిఫికేషన్ కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పుట్టిన వివరాలను నిర్ధారించడానికి ఆధార్‌తో పాటు అదనపు పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే అఫిడవిట్లు, ఇతర ప్రభుత్వ పత్రాలను కూడా ఉపయోగించవచ్చు. 01 అక్టోబర్ 2023 తర్వాత పుట్టిన వారికి తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ మాత్రమే ఫ్రూఫ్ గా పెట్టాలి.

Advertisement

Also Read:  మీ పాన్ కార్డుపై వేరొకరి లోన్.. ఎలా కనిపెట్టాలంటే?

మిగతా వారికి ఈ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయవచ్చు

  • 10వ తరగతి సర్టిఫికేట్ లేదా మార్కుల మెమో
  • ఓటర్ ఐడీ
  • డ్రైవింగ్ లైసెన్స్
  • పాస్‌పోర్ట్
  • మున్సిపల్ బర్త్ సర్టిఫికేట్
  • వివాహ ధృవీకరణ పత్రం
  • పెన్షన్ పేమెంట్ ఆర్డర్ / డొమిసైల్ సర్టిఫికేట్
  • సెంట్రల్/స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఫొటో ఐడీ కార్డ్స్
Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×