E-Paper
Advertisement

కొత్తగా ఏదైనా చేయాలంటూ.. ఉరేసుకున్న నీట్ విద్యార్థి.. ఖంగుతిన్న పోలీసులు!

కొత్తగా ఏదైనా చేయాలంటూ.. ఉరేసుకున్న నీట్ విద్యార్థి.. ఖంగుతిన్న పోలీసులు!
Advertisement

NEET Aspirant Dies: ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నీట్ పరీక్షకు సిద్దమవుతున్న 22 ఏళ్ల జతిన్ కుమార్.. అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 21 ఆదివారం జరగనుండగా.. సరిగ్గా రెండ్రోజుల ముందు అంటే శుక్రవారం అతడు ప్రాణాలు విడిచాడు. అయితే చనిపోయే ముందు చిత్రీకరించిన వీడియోలో అతడు చెప్పిన మాటలు.. ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. ఘజియాబాద్ లోని విజయ్ నగర్ లో గల హెచ్ – బ్లాక్ లో జతిన్ కుమార్ నివసిస్తున్నాడు. వైద్య ప్రవేశ పరీక్ష (నీట్) కోసం అతడు గత కొద్దికాలంగా సిద్దమవుతున్నాడు. ఆదివారం రీ-ఎక్జామ్ ఉండటంతో గురువారం అర్ధరాత్రి వరకూ గదిలో చదువుకుంటూ జతిన్ కనిపించాడు. పరీక్షకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి లేకుండా అటు తిరుగుతూ ఉన్నాడని కుటుంబ సభ్యులు సైతం తెలిపారు. అయితే తెల్లవారుజామున జతిన్ నిద్రలేపడానికి అతడి గదికి వెళ్లగా.. అనూహ్యాంగా అతడు విగతజీవిగా కనిపించాడు.

Advertisement

దీంతో విజయ్ నగర్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందం హుటాహుటీనా ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఉరితాడు తెగిపోవడంతో జతిన్ కింద నేలపై నిర్జీవంగా కనిపించాడు. ఈ క్రమంలో గది అంతా గాలించగా.. పోలీసులకు జతిన్ ఫోన్ లభ్యమైంది. చనిపోయే ముందు జతిన్ వీడియో సైతం రికార్డు చేయడాన్ని పోలీసులు గుర్తించారు. అందులో జతిన్ మాట్లాడుతూ ‘ఈరోజు ఏదైనా భిన్నంగా (కొత్తగా) చేద్దామని ఆలోచిస్తున్నాను’ అని చెబుతూ సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతున్న ఉరితాడును చూపించాడు. అదే సమయంలో నీట్ పరీక్షకు సంబంధించి తనకు ఎలాంటి ఒత్తిడి లేదని, తన తండ్రి కూడా ఆందోళన చెందవద్దని చెప్పారని జతిన్ చెప్పుకొచ్చాడు.

Also Read: రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం.. అన్నదాత సుఖీభవపై.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement

కాగా, జతిన్ ఆ కుటుంబానికి ఒక్కగానొక్క కొడుకు కావడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. జతిన్ తండ్రి ప్రభుత్వ శాఖలో పనిచేస్తుండగా, తల్లి హౌస్ వైఫ్ గా ఉంటోంది. తమ బిడ్డ ఇలా ఎందుకు చేశాడో తెలియక ప్రస్తుతం జతిన్ ఫ్యామిలీ పూర్తిగా షాక్ లో ఉంది. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. ప్రస్తుతం జతిన్ తీసుకున్న వీడియోను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ఉపాసన పాండే తెలిపారు. జతిన్ బాడీని పోస్ట్ మార్టంకు పంపామని.. అన్ని కోణాల్లో ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని ఆమె తెలిపారు.

Also Read: బండి భ‌గీరథ్‌ను వ‌ద‌ల‌ని బీఆరెస్‌! బెయిల్ మంజూరైనా… అది రేవంత్ వ‌ల్లేన‌ట‌!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×