E-Paper
Advertisement

టీవీకె చుట్టూ తమిళనాట రాజకీయాలు.. పార్టీ అభ్యర్థులకు కీలక సూచనలు, ‘కింగ్’ మనమేనని విజయ్ వ్యాఖ్య

టీవీకె చుట్టూ తమిళనాట రాజకీయాలు.. పార్టీ అభ్యర్థులకు కీలక సూచనలు, ‘కింగ్’ మనమేనని విజయ్ వ్యాఖ్య
Advertisement

Chennai: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది. అన్నింటి కంటే ముందుగా తమిళనాడుపై దక్షిణాది ప్రజల దృష్టి పడింది. ఈసారి అధికారంలోకి అధికార డీఎంకె వస్తుందని చెప్పినప్పటికీ, రెండు సర్వే సంస్థల్లో ఒకటి విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మరొకటి సెకండ్ ప్లేస్‌లో ఉంటుందని తేల్చేశాయి. దీంతో అందరి దృష్టి తమిళనాడుపై కేంద్రీకృతమైంది.

టీవీకె పార్టీ చుట్టూ తమిళనాట రాజకీయాలు

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో నటులు లేని పార్టీని అక్కడి ప్రజలు ఊహించు కోలేకపోతున్నారు. కరుణానిధి ఆధ్వర్యంలో డీఎంకె, జయలలిత నేతృత్వంలో అన్నాడీఎంకె పార్టీలు దాదాపు మూడు నాలుగు దశాబ్దాల పాటు తమిళనాట రాజకీయాలను శాసించాయి. ఇటీవల ఆ నేతలిద్దరు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. దీంతో అక్కడ చాలా లోటు కనిపించింది. ఈలోగా నటుడు విజయ్ రంగ ప్రవేశంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.

తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో రెండు సర్వే సంస్థలు విజయ్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. దీంతో ప్రధాన పార్టీలు ఖంగుతిన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటే ఆ పార్టీకి మేజిక్ ఫిగర్ 118 స్థానాలు రావాలి. విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నారని ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొట్టేస్తున్నారు.

Advertisement

పార్టీ అభ్యర్థులకు కీలక సూచనలు, ‘కింగ్’ మనమేనని విజయ్ వ్యాఖ్య

ఈ నేపథ్యంలో శుక్రవారం టీవీకె పార్టీ విజయ్ ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పోటీ చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు అధినేత. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎక్కడికీ వెళ్లవద్దని, నేరుగా పార్టీ ఆఫీసుకు రావాలని చెప్పినట్టు తెలుస్తోంది.

తమిళనాడులో మనమే గెలవబోతున్నామని, ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేస్తున్నట్లు విజయ్ సంకేతాలు ఇచ్చినట్టు అంతర్గత సమాచారం. మనం గెలుస్తామనే నమ్మకం ఉందని, క్యాంప్ రాజకీయాల్లో ఇరుక్కోవద్దని తేల్చిచెప్పారట. ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగవద్దని చెప్పారట.

ALSO READ: కోల్‌కతాలో హై డ్రామా.. బీజేపీ నేత‌లు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేశార‌ని టీఎంసీ ఆరోప‌ణ‌లు

అయితే టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, లేకుంటే కింగ్ మేకర్ రావడం ఖాయమని వాదన అక్కడి ప్రజల్లో బలంగా ఉంది. యాక్సిస్ మై ఇండియా మాత్రం అధికార డీఎంకె కంటే టీవీకే పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పడంతో అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు విజయ్. ఇదిలావుండగా విజయ్ పార్టీ కీలకంగా మారబోతున్న వార్తల నేపథ్యంలో అన్నాడీఎంకె అలర్ట్ అయ్యింది.

విజయ్ మద్దతు కోసం ఎన్డీయే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. టీవీకే ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని గతంలో విజయ్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం సహా కీలక పదవులు తీసుకుని విజయ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజులు ఆగితే కింగ్ ఎవరో.. మేకర్ ఎవరో తేలిపోనుంది. అప్పటివరకు ఈ ఉత్కంఠ తప్పదు?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×