E-Paper
Advertisement

Mallikarjun Kharge: ఎన్డీఏ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు: ఖర్గే జోస్యం

Mallikarjun Kharge: ఎన్డీఏ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు: ఖర్గే జోస్యం
Advertisement

Mallikarjun Kharge on NDA: ప్రధాని మోదీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గే జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వానికి మెజార్టీ లేదని, ఎన్డీఏ సర్కార్ పొరపాటున ఏర్పడిందని అన్నారు. మోదీ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవట్లేదని తెలిపారు. దేశానికి మంచి జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందన్నారు. కానీ.. మంచి జరగకుండా చేయటం ప్రధాని మోదీకి అలవాటు అని విమర్శించారు. దేశం మరింత బలోపేతం అవడం కోసం తాము సహకరిస్తామని ఖర్గే పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి సంఖ్యాబలం లేదని అన్నారు. ఎన్డీఏ సర్కారు మైనార్టీ సర్కార్ అని తెలిపారు. ఇదిలా ఉంటే ఖర్గే వ్యాఖ్యలపై ఎన్డీఏ మిత్ర పక్షాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

గతంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలను గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించాయి. మెజార్టీ రాకుండానే పీవీ నరసింహ రావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు నడిపించలేదా ? కాంగ్రెస్ చరిత్ర గురించి ఖర్గేకు గుర్తు లేదా అని జేడీయూ నేత ఒకరు ఎద్దేవా చేశారు.

Also Read: బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై పీకే సంచలన వ్యాఖ్యలు

Advertisement

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. గతంలో రెండు సార్లు సొంతంగా మెజార్టీ మార్క్ దాటిన బీజేపీ ఈ సారి 240 సీట్లకు పరిమితం అవడంతో కాంగ్రెస్ నేతలు.. మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే 1991లో కాంగ్రెస్‌కు కూడా 244 స్థానాలు దక్కగా.. మిత్ర పక్షాలతో కలిసి పీవీ నరసింహ రావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2004లో కాంగ్రెస్ 114 స్థానాల్లో గెలుపొందగా.. మిత్ర పక్షాల అండతో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×