E-Paper
Advertisement

NDA CM Meeting : భారత్ అభివృద్ధికి, పేదల సాధికారతకు కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మోదీ

NDA CM Meeting : భారత్ అభివృద్ధికి, పేదల సాధికారతకు కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మోదీ
Advertisement

NDA CM’s Conclave Meeting : హరియాణా రాజధాని చండీగఢ్’లో ఇవాళ ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉఫ ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు.  మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

తొలి సమావేశం…

Advertisement

ఇక హరియాణా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏర్పాటైన తొలి ఎన్డీఏ కూటమి సమావేశం ఇదే కావడం గమనార్హం.

17 సీఎంలు, 18 డీసీఎంలు…

Advertisement

మొత్తం 17 రాష్ట్రాల సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరైన ఈ సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్ అభివృద్ధికి తమ కూటమి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి పక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. భేటీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జెపి నడ్డా హాజరయ్యారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. అనంతరం వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

Also Read :  దక్షిణాదిలో కాంగ్రెస్ జెండాను నిలబెట్టేది ఎవరు, వయనాడ్’పై హైకమాండ్ స్పెషల్ ఫోకస్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×