E-Paper
Advertisement

Nasa Laser : చంద్రుడి ఆవల నుంచి ‘హలో’

Nasa Laser : చంద్రుడి ఆవల నుంచి ‘హలో’
Advertisement
Nasa Laser

Nasa Laser : రోదసి కమ్యూనికేషన్లలో నాసా మరో కీలక మైలురాయిని అధిగమించింది. చంద్రుడి కన్నా సుదూరాలకు, అత్యంత వేగంగా డేటాను పంపడమే కాదు.. అక్కడి నుంచి సమాచారాన్ని కూడా స్వీకరించగలిగింది.
డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్(DSOC-డీశాక్) ప్రాజెక్టు ద్వారా ఇది సాధ్యమైంది.

ఇందులో భాగంగా లేజర్ కాంతి సాయంతో 16 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైకీ స్పేస్ క్రాఫ్ట్‌కి జరిపిన సమాచార బట్వాడా విజయవంతమైంది. భూమి నుంచి చంద్రుడి దూరంతో పోలిస్తే ఇది 40 రెట్లు. ప్రస్తుతం స్పేస్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్ల కోసం రేడియో తరంగాలను వినియోగిస్తున్నారు. ఈ పద్ధతి కన్నా లేజర్ విధానంలో డేటా బదిలీ 10 నుంచి 100 రెట్ల వేగంతో జరుగుతుంది. అంటే సెకనుకు 1.2 గిగాబిట్ల వేగంతో సమాచార మార్పిడి జరుగుతుందన్నమాట.

Advertisement

రాన్రాను అంతరిక్ష పరిశోధనలు ముమ్మరం కావడంతో పాటు పెద్ద మొత్తాల్లో డేటా బట్వాడా అనివార్యమవుతోంది. అందుకే లేజర్ ఆధారిత కమ్యూనికేషన్లపై నాసా దృష్టి సారించింది. వాస్తవానికి లేజర్ ఆధారిత కమ్యూనికేషన్ టెక్నాలజీ కొత్తదేం కాదు. లో-ఎర్త్ ఆర్బిట్ నుంచి జాబిల్లిపైకి ఆప్టికల్ కమ్యూనికేషన్లను గతంలోనూ పరీక్షించారు. అయితే డీప్ స్పేస్‌ కమ్యూనికేషన్లలో డీశాక్ తరహా ప్రాజెక్టును చేపపట్టడం ఇదే తొలిసారి.

టెస్ట్ డేటా ఎన్‌కోడ్ చేసిన లేజర్ కాంతి పుంజాన్ని ఈ నెల 14న కాలిఫోర్నియా శాన్‌డియాగోలోని కాల్‌టెక్ పలోమార్ అబ్జర్వేటరీలోని హేల్ టెలిస్కోప్ నుంచి పంపారు. 16 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైకీ స్పేస్ఋక్రాఫ్ట్‌లోని లేజర్ ట్రాన్సీవర్ ఆ డేటాను రిసీవ్ చేసుకుంది. ‘హలో’ అంటూ అక్కడ నుంచి తిరిగి భూమికి బదులు కూడా ఇచ్చింది.

Advertisement

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో హై-బ్యాండ్‌విడ్త్ డేటా ట్రాన్సిమిషన్‌లో ముందడుగు పడినట్టయింది. భవిష్యత్తులో చేపట్టే అంతరిక్ష మిషన్లకు ఇది అత్యంత కీలకం కానుంది. సైకీ ట్రాన్సీవర్-గ్రౌండ్ స్టేషన్లను అనుసంధానించిన ఆటోమేటెడ్ సిస్టమ్స్ వల్ల డేటా బట్వాడా వేగంగా, విజయవంతంగా జరిగింది.

డీశాక్ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రయోగాలకు మైలురాయిలా నిలవనుంది. అంగారక గ్రహంపైకి మానవులను పంపేందుకు నాసా సిద్ధమైంది. అక్కడికి వెళ్లే వ్యోమగాములకు అత్యధిక వేగంతో డేటాను బదిలీ చేయడం డీశాక్ ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×