E-Paper
Advertisement

బహిరంగ మూత్రవిసర్జనకు చెక్. మైసూరు మున్సిపాలిటీ వినూత్న ప్రయోగం

బహిరంగ మూత్రవిసర్జనకు చెక్.  మైసూరు మున్సిపాలిటీ వినూత్న ప్రయోగం
Advertisement

కర్ణాటకలోని మైసూరు నగరం తన స్వచ్ఛతకు.. రాజసం ఉట్టిపడే కట్టడాలకు ప్రపంచ ప్రసిద్ధి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిచోట్ల బహిరంగ మూత్రవిసర్జన సమస్య నగర పాలక సంస్థకు సవాలుగా మారింది. ఈ దురలవాటును అరికట్టడానికి మైసూరు నగర పాలక సంస్థ (MCC) ఇప్పుడు ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. అదే గోడలకు అద్దాలు అమర్చడం.

సాధారణంగా గోడలపై దేవుళ్ల చిత్రాలు వేయడం.. ఇక్కడ ఉమ్మరాదు/మూత్రం పోయరాదు. అని హెచ్చరికలు రాయడం మనం చూస్తుంటాం. కానీ మైసూరు అధికారులు మాత్రం మనిషిలోని సిగ్గును లక్ష్యంగా చేసుకున్నారు. నగరంలోని అత్యధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో.. ప్రజలు తరచుగా మూత్రవిసర్జన చేసే గోడలకు పెద్ద పెద్ద అద్దాలను అమర్చారు. ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Advertisement

ఎవరైనా వ్యక్తి ఆ గోడ వద్దకు వచ్చి మూత్రవిసర్జన చేయడానికి సిద్ధపడగానే.. ఎదురుగా ఉన్న అద్దంలో తన ప్రతిబింబం కనిపిస్తుంది. తాను చేస్తున్న పనిని తన కళ్లతో తానే చూసుకోవడం వల్ల ఆ వ్యక్తిలో ఒక రకమైన సిగ్గు.. అసౌకర్యం కలుగుతాయని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా అద్దంలో వెనుక నుంచి వచ్చే వాహనాలు.. బాటసారులు కూడా కనిపిస్తుంటారు. దీనివల్ల ఎవరైనా తనను గమనిస్తున్నారేమోనన్న భయం ఆ వ్యక్తిని ఆ పని చేయకుండా ఆపుతుంది.

ఈ ప్రయోగం ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఆయా ప్రాంతాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు నగర పాలక సంస్థ అధికారులు వెల్లడించారు. గోడలపై దేవుళ్ల చిత్రాలు వేస్తే వాటిపై కూడా మూత్రం పోసే కిరాతకులు ఉన్నారని.. కానీ ఈ అద్దాల ప్రయోగం వారిని మానసికంగా ప్రభావితం చేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మైసూరును అత్యంత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ మిర్రర్ థెరపీ ఒక కీలకమైన అడుగుగా నిలుస్తోంది.

Advertisement

Read Also: హర్మూజ్‌ జలసంధి.. ఆపై ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ బ్రేక్, ట్రంప్ ప్రకటన, త్వరలో 14 అంశాలపై ఒప్పందం!

 

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×