// // Loksabha: బీజేపీ తీరుపై ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం.. పార్లమెంటు ప్రాంగణంలో నిరసన -->
E-Paper
Advertisement

Loksabha: పోరాటం ఆగదు.. పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీ నిరసన, బీజేపీ తీరుపై ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి ఆగ్రహం

Loksabha: పోరాటం ఆగదు.. పార్లమెంటు  ప్రాంగణంలో ఎంపీ నిరసన, బీజేపీ తీరుపై ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి ఆగ్రహం
Advertisement

Loksabha: లోక్‌సభ సమావేశాల్లో అధికార పార్టీ వైఖరి నిరసిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. ‘PM IS COMPROMISED’ అనే పోస్టర్ పట్టుకుని నిరసన తెలిపారు. అంతేకాదు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సభ్యులు. ఉన్నట్లు సభ్యుల నిరసన వెనుక అసలేం జరిగంది?

లోక్‌సభ ప్రధాన గేటు వద్ద కాంగ్రెస్ ఎంపీ నిరసన

Advertisement

మంగళవారం లోక్‌సభ నుంచి 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ సభ్యులు అనురాగ్ ఠాగూర్,నిశికాంత్ దూబే లాంటి నేతలు పదే పదే అడ్డుతగిలారు. ఆ తర్వాత స్పీకర్ మరొక సభ్యుడికి మైక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పోడియం వద్దకు వెళ్లారు.

దీనిపై ఆగ్రహించిన స్పీకర్, 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. బుధవారం ఉదయం సమావేశాల ప్రారంభానికి ముందు సస్పెండ్ అయిన లోక్‌సభ మెయిన్ గేటు వద్ద నిరసనకు దిగారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సభ్యుల నిరసనకు గొంతు కలిపారు. దీనికి కాంగ్రెస్ సహా విపక్షాల సభ్యులు మద్దతు తెలిపాయి.

Advertisement

పాలకపక్షం వైఖరిని ఎండగట్టిన సభ్యులు, ఎంపీ కిరణ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో వాస్తవాలు బయటకు రాకుండా బీజేపీ అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. ఎంపీల నోరును నొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. పార్లమెంటు సమావేశాలను సజావుగా నడపాలనే ఉద్దేశం పాలక పక్షానికి లేదన్నారు.

దేశంలో ప్రజా సమస్యలపై పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మమ్మల్ని ప్రజలు గెలిపించింది ప్రజా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించడం కోసమని అన్నారు. పాలక పక్షం చేస్తున్న ఇలాంటి పనులను తాము అడ్డుకుంటున్నామనే ఒక్క కారణంతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ: ఢిల్లీలో కొత్త టెన్షన్.. రోజుకు 54 మంది, పోలీసులకు చెమటలు

గొంతు నొక్కిన మాత్రాన ఆగే ప్రయత్నం చేయమని కుండబద్దలు కొట్టేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, ఆర్మీ మాజీ చీఫ్‌ నరవణె పుస్తకం, టారిఫ్‌లపై మోదీ లొంగిపోయారని ఆరోపిస్తూ పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు కాంగ్రెస్ ఎంపీ సభ్యులు.

 

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×