E-Paper
Advertisement

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ
Advertisement

Bengal Clashes: బెంగాల్‌లో ప్రభుత్వం మారిన తర్వాత దాడులు-ప్రతి దాడులు జరుగుతున్నాయి. ప్రతిరోజు అక్కడ ఎక్కడో దగ్గర ఘర్షణలు జోరందుకున్నాయి. ఈ దాడుల్లో టీఎంసీ నేతలు, కార్యకర్తలు బాధితులుగా మారిపోతున్నాయి. జరుగుతున్న పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.

బెంగాల్ లో బీజేపీ పాలనపై టీఎంసీ ఆగ్రహం

Advertisement

బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. బీజేపీ అధికారంలోకి వచ్చిన నుంచి టీఎంసీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ అనాగరికమని, రాక్షసమైందని ఆరోపించారు. రాజకీయ హింసాకాండలో బీజేపీ మద్దతుదారులు కర్ణాకు చెందిన సందీప్ ఘోష్‌పై దాడి చేయడం దారుణమన్నారు.

ఒక భవనంలోని మూడవ అంతస్తు నుండి దూకేలా బలవంతం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన మెదడు రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, అందుకు బాధ్యులైనవారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. హింస అక్కడితో ఆగలేదని, కట్వాలో బీజేపీ మద్దతుదారులు మా పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారని తెలిపారు.

Advertisement

రాష్ట్రంలో పాలన శాంతిభద్రతలు దారుణం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

బెదిరింపు, బీభత్స రాజకీయాలు చేస్తూ కేడర్‌ని భయాందోళనకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న బెంగాల్‌‌ను అరాచకత్వం వైపు నెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ హింసలో ఇదంతా భాగమని, ఇలాంటి దాడుల వల్ల పరిపాలనలో శాంతి భద్రతలు ఏ విధంగా కుప్ప కూలాయనే చెప్పడానికి ఇదొక ఉదాహరణగా ఉందన్నారు.

నేరస్థులు నడి రోడ్డుపై బరి తెగించి ప్రవర్తిస్తున్నారని, జవాబుదారీతనం నుండి తప్పించుకున్నప్పుడు పరిపాలన ప్రమాదకరమైన వైఫల్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. పౌరులను రక్షించలేని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక్కటేనన్నారు. రాజకీయ హింసను అరికట్ట లేని పాలకులు ప్రాథమిక విధిలో విఫలమైనట్లేనని ఆరోపించారు.

ALSO READ: ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×