E-Paper
Advertisement

Modi : బందీపూర్ టైగర్ రిజర్వులో మోదీ సందడి.. ఫోటోలు వైరల్..

Modi : బందీపూర్ టైగర్ రిజర్వులో మోదీ సందడి.. ఫోటోలు వైరల్..
Advertisement

Modi : ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని బందీపూర్ టైగర్‌ రిజర్వును సందర్శించారు. ఖాకీ ప్యాంట్‌, కామోఫ్లాజ్‌ టి-షర్ట్‌, స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించిన మోదీ ఉత్సాహంగా ఈ టైగర్‌ రిజర్వులో 20 కిలోమీటర్లు ప్రయాణించారు. అటవీ అందాలను ఆస్వాదించారు. ఈ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.

తెప్పకాడు ఎలీఫ్యాంట్ క్యాంప్‌ వద్ద ప్రధాని ఏనుగులకు చెరకుగడలను ఆహారంగా అందించారు. ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్న ‘ఎలిఫెంట్ విష్పరర్స్‌’ డాక్యుమెంటరీలో నటించిన బొమ్మన్‌, బెళ్లి దంపతులు, నిర్మాత, దర్శకుడు, మావటిలతో ముచ్చటించారు.

Advertisement

రాచనగరిలోని కర్ణాటక సార్వత్రిక విశ్వ విద్యాలయంలో ఆదివారం నిర్వహించే పులుల బందీపూర్ అభయారణ్యం- టైగర్‌ ప్రాజెక్టు సువర్ణ మహోత్సవాలను ప్రారంభించేందుకు శనివారం రాత్రే ప్రధాని మోదీ మైసూరుకు చేరుకొన్నారు. ప్రాజెక్ట్‌ టైగర్‌కు 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.

బందీపూర్ టైగర్ రిజర్వు ఫొటోలను మోదీ ట్విటర్ లో పోస్ట్ చేశారు. “రమణీయమైన బందీపూర్ టైగర్‌ రిజర్వులో ఉదయం గడిపాను. దేశ ప్రకృతి సౌందర్యాన్ని, వన్యప్రాణుల వైవిధ్యాన్ని ఆస్వాదించాను’’ అని మోదీ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×