E-Paper
Advertisement

PM Modi Relax at Kanyakumari: ఈసారి సౌత్.. కన్యాకుమారిలో మోదీ బస.. నార్త్ మాటేంటి..?

PM Modi Relax at Kanyakumari: ఈసారి సౌత్.. కన్యాకుమారిలో మోదీ బస.. నార్త్ మాటేంటి..?
Advertisement

PM Modi Relax at Kanyakumari: సార్వత్రిక ఎన్నికలు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. బుధవారం సాయంత్రం ఐదుగంటలకు రాజకీయ పార్టీల ప్రచారం ముగియనుంది. దాదాపు రెండున్నర నెలలపాటు రెస్ట్ లేకుండా సభలు, సమావేశాలు, రోడ్ షోలతో జాతీయ పార్టీల నేతలు బిజిబిజీ అయ్యారు. విశ్రాంతి కోసం నేతలు సిద్ధమవుతున్నారు.

ఇందులో‌భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 30న తమిళనాడులోని కన్యాకుమారి వెళ్లనున్నారు. స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద మూడు రోజులపాటు మెడిటేషన్‌లో నిమగ్నం కానున్నారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా తిరువనంతపురానికి చేరుకుంటారు.

Advertisement

అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కన్యాకుమారికి వెళ్లనున్నారు. సముద్ర మధ్యలో ఉన్న వివేకానంద స్మారకం వద్దకు పడవలో చేరుకుంటారు. జూన్ ఒకటి సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. వున్నట్లుండి సౌత్‌పై ప్రధాని మోదీ ఎందుకు ఫోకస్ చేసినట్టు అంటూ చర్చించుకోవడం నేతలు, ప్రజల వంతైంది. ఎన్నికల ప్రచారానికి ముందు తమిళనాడులోని రామేశ్వరం వచ్చారు ప్రధాని. ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో అక్కడికి వస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Kejriwal Interim Bail Extension : ముగియనున్న కేజ్రీవాల్ బెయిల్ గడువు.. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్

modi meditation break at Kanyakumari in TamilNadu
modi meditation break at Kanyakumari in TamilNadu
Advertisement

2019 ఎన్నికల ప్రచారం ముగియగానే ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ గుహకు చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఈసారి ఆయన దృష్టి సౌత్ వైపు పడింది. టూరిజం పరంగా ఇక్కడి ప్రాంతాలు బాగున్నాయని, ఈ నేపథ్యంలో కన్యాకుమారిని ఎంచుకున్నారన్నది ఆ పార్టీ నేతల మాట.

Also Read: మెట్రో రైలులో మంటలు.. వీడియో ఇదిగో

రాజకీయ నేతల వెర్షన్ మరోలా ఉంది. కమలం పార్టీకి ఈసారి నార్త్‌లో నెగిటివ్ సంకేతాలు ఉన్నాయని, సౌత్‌లో పాజిటివ్ టాక్ ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో సౌత్ వైపు దృష్టి పెట్టి ఉండవచ్చని అంటున్నారు. అన్నట్లు ఆ మధ్య మాల్దీవుల విషయంలో కాస్త తేడాలు రావడంతో లక్షద్వీప్‌కు వెళ్లారు ప్రధాని మోదీ. ఆ ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేశారు. ఆ తరహాలో తమిళనాడులో ఏమైనా ప్లానింగ్ ఉందా అని చర్చించుకోవడం ప్రజల వంతైంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×