E-Paper
Advertisement

Pm Modi: ఏ శ‌క్తీ ఆర్టిక‌ల్ 370ని మ‌ళ్లీ తీసుకురాలేదు.. దేశంలో ఒకే రాజ్యాంగం.. మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Pm Modi: ఏ శ‌క్తీ ఆర్టిక‌ల్ 370ని మ‌ళ్లీ తీసుకురాలేదు.. దేశంలో ఒకే రాజ్యాంగం.. మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Pm Modi: మ‌హారాష్ట్ర విజ‌యంతో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వ‌హించారు. ఈ సంబురాల్లో ప్ర‌ధాని మోడీ, అమిత్ షాతో పాటూ న‌డ్డా రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ…మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారని అన్నారు. కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయని, అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని అభిప్రాయ‌ప‌డ్డారు. వికసిత్‌ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Also read: జార్ఖండ్‌‌ను నిలుపుకున్న ఇండియా కూటమి.. 81కి 55 స్థానాల్లో విజయబావుటా

Advertisement

ఉత్త‌ర్ ప్ర‌దేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి బలం చేకూరిందని చెప్పారు. 50 ఏళ్ల త‌ర‌వాత ఇది అతిపెద్ద విజయం అని అన్నారు. కాంగ్రెస్‌ నేతలారా చెవులు రిక్కించి వినండి.. ప్రపంచంలో ఏ శక్తీ ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఒకే రాజ్యాంగం ఉంది, అది అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగమ‌ని అన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ అవమానించాలని చూసిందని, రెండు రాజ్యాంగాలు ఉండాలన్న.. కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టార‌ని చెప్పారు.

సీఎంలను తీసుకొచ్చి ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ హామీలు అమలుచేయలేదని వ్యాఖ్యానించారు. అందుకే జనం కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పరాన్నజీవిగా మారిందని, ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, హర్యానాతో పాటు.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఖాతా ఖాళీ అయిందని అన్నారు. కాంగ్రెస్‌ విభజనవాద రాజకీయాలు విఫలమ‌య్యాయ‌ని చెప్పారు. రాజ్యాంగంలో వక్ఫ్‌ చట్టానికి స్థానమే లేదని, ఓట్ల కోసం కాంగ్రెస్‌ వక్ఫ్‌ చట్టం తెచ్చింద‌ని విమ‌ర్శించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×