E-Paper
Advertisement

Metro Rail : లక్ష్యానికి దూరంగా మెట్రో రైళ్లు.. అంచనాలు తప్పాయా..?

Metro Rail : లక్ష్యానికి దూరంగా మెట్రో రైళ్లు.. అంచనాలు తప్పాయా..?
Advertisement

Metro Rail : దేశంలో మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌లపై అంచనాలు తప్పుతున్నాయి. ఆశించిన రీతిలో ప్రయాణికులను మెట్రో రైళ్లు ఆకట్టుకోలేకపోతున్నాయి. రైడర్‌షిప్ అంచనాల్లో 50 శాతం మించడం లేదని ఓ నివేదికలో వెల్లడైంది. ఈ మేరకు ఐఐటీ-ఢిల్లీ, ఢిల్లీకి చెందిన మేధోమథన సంస్థ ఇన్‌ఫ్రా విజన్ ఫౌండేషన్ సంయుక్త సర్వే చేపట్టాయి. దేశంలోని అత్యధిక మెట్రోరైళ్లను పరిశీలిస్తే.. ప్రొజెక్టెడ్ రైడర్‌షిప్‌లో 25-30 శాతమే సాధిస్తున్నట్టు ఆ నివేదిక తెలిపింది.

ఢిల్లీ మెట్రో రైల్ ను మినహాయిస్తే.. ఇతర మెట్రోరైల్ వ్యవస్థలన్నీ ప్రొజెక్డెడ్ రైడర్‌షిప్ అంచనాలను చేరుకోలేకపోతున్నాయి. ఢిల్లీ మెట్రో రైలు మాత్రం రైడర్‌షిప్ అంచనాల్లో 47.45% సాధించినట్టు నివేదించారు. 1984లో కోల్‌కతాలో తొలి మెట్రో రైల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. భారతీయ రైల్వే ఆ ప్రాజెక్టును చేపట్టింది. 2002లో ఢిల్లీ మెట్రో తొలి కారిడార్ పనులు ఆరంభమైన తర్వాతే మెట్రో రైల్ వ్యవస్థలు ఊపందుకున్నాయి.

Advertisement

ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్ సహా 20 నగరాల్లో మెట్రో వ్యవస్థలు విస్తరించాయి. మొత్తం 905 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇందులో 600 కిలోమీటర్ల మార్గం గత 9 ఏళ్లలో ఆమోదం పొందిందే. కాన్పూర్, సూరత్, అహ్మదాబాద్, భోపాల్, ఇందౌర్, ఆగ్రా, పట్నా, కొచి, పుణె, నాగ్‌పూర్, లఖ్‌నవూ సిటీల కోసం ఈ మెట్రో ప్రాజెక్టులను ఆమోదించారు. అయితే ఆయా ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ అంచనా ప్రయాణికుల సంఖ్యను అందుకోలేకపోయాయి.

మెట్రో రైళ్లు ఎక్కే ప్రయాణికుల సంఖ్య బాగా తక్కువగా ఉండటంపై పార్లమెంటరీ సంఘం ఒకటి నిరుడు జూలైలో ఓ నివేదిక సమర్పించింది. దాని ప్రకారం 2020-21 మధ్య ఢిల్లీ మెట్రోలో సగటున రోజూ 50.65 లక్షల మంది ప్రయాణించారు. అప్పటికీ బ్రేక్ఈవెన్ సాధనకు ఇంకా 38.34 లక్షల మంది తక్కువే ఉన్నారని ఆ ప్యానెల్ స్పష్టం చేసింది. అయితే రైడర్‌షిప్ టార్గెట్‌ను ఢిల్లీ మెట్రో చేరిందని డీఎంఆర్‌సీ అధికారులు చెబుతున్నారు. రోజూ 67 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ప్రొజెక్టెడ్ రైడర్ షిప్ కన్నా ఈ సంఖ్య ఎంతో ఎక్కువని వివరించారు. కొవిడ్ సమయంలో ప్రయాణికులు బాగా తగ్గినా.. ప్రస్తుతం వారి సంఖ్య పెరుగుతోందని ఢిల్లీ మెట్రో అధికారులు చెప్పారు.

Advertisement

మెట్రో రైల్ ప్రాజెక్టులను చేపట్టంతోనే సరిపెడితే కుదరదని నివేదికలో ఐఐటీ-ఢిల్లీ స్పష్టం చేసింది. అన్ని నగరాల్లో మెట్రో రైళ్ల సమయాలకు అనుగుణంగా బస్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థలను ప్రభుత్వాలు అనుసంధానించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లో మూడోవంతు మంది ప్రతి రోజూ కనీసం 5 కిలోమీటర్లు ప్రయాణిస్తారని నివేదిక పేర్కొంది. అర్బన్ ప్రాంతాల్లో జనాభా ఆధారంగా వర్క్-రిలేటెడ్ ట్రావెల్ ప్యాట్రన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×