E-Paper
Advertisement

Measles In Mumbai : ప్రాణాంతకంగా మారిన మీజిల్స్.. చిన్నారులకు డేంజర్..

Measles In Mumbai : ప్రాణాంతకంగా మారిన మీజిల్స్.. చిన్నారులకు డేంజర్..
Advertisement

Measles In Mumbai : ముంబయిలో మీజిల్స్ వ్యాధి పిల్లలకు ప్రాణాంతకంగా మారింది. ముఖ్యంగా మురికివాడల్లోని పిల్లలు మీజిల్స్ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురౌతున్నారు. సోమవారం నుంచి ఈ మీజిల్స్ వ్యాధి కేసులు ముంబైలో క్రమంగా పెరిగిపోతూ ఉన్నాయి. ముంబైలోని కన్తూర్బా ఆసుపత్రిలో ఈ మీజిల్స్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది మురికి వాడకు చెందిన చిన్నారులే ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా వీరినుంచే అధికంగా ఉంది.

వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం ముంబైలో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 16 వరకు ఐదుగురు చిన్నారులు మీజిల్స్‌ వ్యాధితో మృతి చెందారు. ముంబైలో బీఎంసీ వార్డుల్లో ఉన్న చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం.. తూర్పు, పశ్చిమ గోవండీ, బైకళ, కుర్లా, వడాల, ధారావి లొకేషన్లను హైరిస్క్ ఏరియాలుగా ప్రకటించారు.

Advertisement

మీజిల్స్ అంటువ్యాధని, మోరిబిలివైరస్ ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మీజిల్స్ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు. వ్యాధి తీవ్రంగా ఉన్నవాళ్లల్లో కళ్లు ఎర్రగా మారి కండ్లకలక రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. గర్భిణీలకు, ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు ఈ వ్యాధి సంభవించే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. మీజిల్స్ వ్యాధిని నివారించడానికి మీజిల్స్ వ్యాక్సిన్ కూడా ఉందని.. సరైన సమయంలో తప్పకుండా ఆ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మీజిల్స్ ప్రాణాంతకమైంది కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×