E-Paper
Advertisement

Same Charging Port: ఇక ఒకే ఛార్జింగ్ పోర్టుతో అన్ని ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు

Same Charging Port: ఇక ఒకే ఛార్జింగ్ పోర్టుతో అన్ని ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు
Advertisement

Same Charging Port: మీ ఇంట్లో మూడు, నాలుగు కంపెనీల ఫోన్లు, రకరకాల వేరబుల్స్ ఉన్నాయా? వాటికి వేర్వేరు ఛార్జర్లు ఉన్నాయా? ఎప్పుడైనా బయటికి వెళ్లాల్సివచ్చినప్పుడు అన్ని ఛార్జర్లనూ మోసుకెళ్లడం ఇబ్బందిగా ఉందా? ఇకపై అలాంటి బాధలు తొలగిపోబోతున్నాయి. ఎందుకంటే… అన్ని ఫోన్లకూ ఒకే విధమైన ఛార్జింగ్ పోర్ట్ అమర్చేందుకు కంపెనీలు అంగీకరించాయి. అదే జరిగితే… ఏ ఫోనుకైనా ఇక ఒకే ఛార్జర్ సరిపోతుంది. ఛార్జర్ల వాడకంలో వినియోగదారుల కష్టాలు తీరిపోవడమే కాదు… ఈ-వేస్ట్ కూడా తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.

స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకూ ఒకే రకమైన ఛార్జింగ్‌ పోర్ట్‌ను దశలవారీగా అమల్లోకి తెచ్చేందుకు కంపెనీలు, పరిశ్రమ సంఘాలు ఒప్పుకున్నాయని… వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వేరబుల్స్‌కు కూడా… అంటే స్మార్ట్ వాచ్ లు, ఇయర్ బర్డ్స్ లాంటి డివైజ్ లకు ఒకే రకమైన ఛార్జింగ్‌ పోర్ట్‌లు లేదా ఛార్జింగ్ డివైజ్ లను అమర్చేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక ఉప కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

Advertisement

ప్రస్తుతం రకరకాల స్మార్ట్ ఫోన్లు, ఛార్జర్లు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఆపిల్ తో పాటు శాంసంగ్ కూడా కొన్ని మోడళ్ల ఫోన్లకు ఇప్పుడు బాక్స్ తో పాటు ఛార్జర్ ఇవ్వడం లేదు. కేవలం ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఇస్తున్నాయి. ఐఫోన్ కైతే ఛార్జింగ్ పోర్టులు కూడా ఢిఫరెంట్ గా ఉంటాయి. USB టైప్ ఛార్జర్ తో ఐఫోన్ ఛార్జ్ చేసేందుకు వీలుపడదు. ఎందుకంటే… ఐఫోన్ కేబుల్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ నే సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఐఫోన్ కేబుల్ ఒక చివరి భాగాన్ని టైప్ సి ఛార్జర్లో పెట్టి.. మరో చివరి భాగాన్ని ఫోన్ కు అనుసంధానిస్తేనే ఐఫోన్ ఛార్జ్ అవుతుంది. శాంసంగ్ లోనూ కొన్ని మోడళ్ల ఫోన్లు ఇప్పుడు ఇలాగే వస్తున్నాయి. అలాగే టైప్ సి ఛార్జర్, మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ లు ఉన్న ఫోన్లకు… వేరే మోడల్ ఛార్జర్ తో ఛార్జింగ్ చేసుకునే వీలుండదు. ఇలాంటి బాధలన్నింటికీ త్వరలోనే చెక్ పెట్టే అవకాశం రాబోతోంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లే కాదు… ల్యాప్‌టాప్‌లకు కూడా USB టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్టే దశల వారీగా అందుబాటులోకి రానుంది. ఫీచర్‌ ఫోన్లకు మాత్రం ప్రత్యేక పోర్ట్‌ ఉంటుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×