E-Paper
Advertisement

Railway Station Parking: రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం.. దాదాపు 400 బైక్‌లు దగ్దం, ఎలా జరిగింది?

Railway Station Parking: రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం.. దాదాపు 400 బైక్‌లు దగ్దం, ఎలా జరిగింది?
Advertisement

Railway Station Parking: కేరళలోని త్రిశూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 400 బైక్ లు దగ్ధమయ్యాయి. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు వందలాది వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

త్రిశూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

Advertisement

ఆదివారం ఉదయం త్రిశూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వందలాది ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. ఈ విషయాన్ని అగ్నిమాపక అధికారులు తెలిపారు. పెయిడ్-పార్కింగ్ షెడ్‌లో ఉదయం 6.30 గంటలకు మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పావు గంటల తర్వాత ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందింది.

Advertisement

ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై విద్యుత్ తీగల నుంచి నిప్పురవ్వ పడి మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనలో షెడ్‌లోవున్న 400 టూ వీలర్స్ వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం అగ్నికి ఆహుతి అయ్యాయి. మూడు అగ్నిమాపక బృందాలు 7.45 గంటల ప్రాంతంలో రంగంలోకి దిగాయి. 

దాదాపు 400 బైక్‌లు దగ్దం, ఘటన ఎలా జరిగింది?

రెండు గంటల తర్వాత మంటలను అధికారులు అదుపులోకి తెచ్చారు. అయితే మంటలు రైల్వే‌స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. కేవలం ద్విచక్ర వాహనాలు కాకుండా టిన్ షీట్లతో కప్పబడిన షెడ్ మొత్తం మంటల్లో దెబ్బతిన్నట్లు అధికారి చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.  ఈ సంఘటనకు సంబంధించి వెంటనే నివేదిక సమర్పించాలని త్రిస్సూర్ సిటీ పోలీసు కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఫోరెన్సిక్ బృందాన్ని నియమిస్తామని తెలిపారు.

ALSO READ:  ఛత్తీస్‌‌ఘడ్‌లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోలు మృతి

మరోవైపు అగ్నిప్రమాదం ఘటనపై కేంద్రమంత్రి సురేష్ గోపి.. సీనియర్ రైల్వే అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డివిజనల్ రైల్వే మేనేజర్-DRM స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. ఈ ఘటన అత్యంత తీవ్రంగా పరిగణించినట్టు తెలిపారు. 

మంటలు అదుపులో వచ్చినప్పటికీ పార్కింగ్ షెడ్ పూర్తిగా దగ్ధమైంది. మంటల తీవ్రతకు టిన్-షీట్ పైకప్పు నిర్మాణం కూలిపోయింది. ప్లాట్‌ఫారమ్‌కు దగ్గరగా పార్కింగ్ స్థలం ఉంది. ఘటన సమయంలో ప్యాసింజర్ రైళ్లు అటువైపు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. మంటలు రైలు ఇంజిన్‌కు వ్యాపించాయనే వార్తలను రైల్వే అధికారులు తోసిపుచ్చారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×