E-Paper
Advertisement

Maoist Surrender: మావోయిస్టు పార్టీకీ మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు

Maoist Surrender: మావోయిస్టు పార్టీకీ మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు
Advertisement

Maoist surrender: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచిన దంతేవాడ జిల్లాలో.. 37 మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటు ఎస్పీ సమక్షంలో జరిగింది. వారిలో 27 మందిపై గతంలో ప్రభుత్వం రూ.65 లక్షల రివార్డు ప్రకటించింది. అలాగే వారిలో 12 మంది మహిళా మావోయిస్టులు ఉండడం విశేషం.

ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి లొంగుబాటు జరగడం భద్రతా వర్గాల్లో సంచలనం సృష్టించింది. గత కొద్ది నెలలుగా భద్రతా బలగాల ఒత్తిడి పెరగడం, అడవుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడంతో.. ఆపరేషన్లు కొనసాగడం వల్లే ఈ స్థాయిలో లొంగుబాటు సాధ్యమైందని అధికారులు అంచనా వేస్తున్నారు. 27 మందిపై రూ.65 లక్షల రివార్డు ప్రకటించింది.

Advertisement

లొంగిపోయిన 27 మందిపై గతంలో భారీ రివార్డులు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వీరిలో పలువురు భద్రతా బలగాలపై జరిగిన దాడులు, ఐఈడీ పేలుళ్లు, పౌరుల హత్యలు వంటి కీలక కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కొందరు ప్రాంతీయ కమాండర్ల కింద పనిచేసినట్లు అధికారులు గుర్తించారు.

Also Read: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!

Advertisement

మొత్తంగా చూస్తే, ఛత్తీస్‌గఢ్‌లో 37 మంది మావోయిస్టుల సమూహ లొంగుబాటు రాష్ట్ర భద్రతా పరిస్థితుల్లో కీలక మలుపుగా మారింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది మావోయిస్టులు ఇదే మార్గాన్ని ఎంచుకునే అవకాశముందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×