E-Paper
Advertisement

Maoist Surrender: మావోలకు మరో ఎదురుదెబ్బ.. 21 మంది లొంగుబాటు

Maoist Surrender: మావోలకు మరో ఎదురుదెబ్బ.. 21 మంది లొంగుబాటు
Advertisement

Maoist Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్​గఢ్‌‌లో ఆదివారం 21 మంది లొంగిపోయారు. కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు.. పార్టీ నిర్మూలన దిశగా సాగుతోంది. గత కొన్ని నెలలుగా వందలాది మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించగా, మరికొందరు లొంగిపోతూ పార్టీని బలహీనపరుస్తున్నారు.

తాజాగా కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈ లొంగుబాట్లు పార్టీ కీలక నాయకత్వంపై గట్టి దెబ్బ తగిలింది.
ఈ క్రమంలో కాంకేర్‌లో 21 మంది, 18 ఆయుధాలు అప్పగించారు.  ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా కేశ్‌కాల్ డివిజన్లో శనివారం (అక్టోబర్ 25) మరో 21 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వారిలో కేశ్‌కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేష్, నలుగురు డివిజన్ వైస్ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ బృందం 18 ఆయుధాలను పోలీసులకు అప్పగించింది.

Advertisement

అప్పగించిన ఆయుధాల్లో 3 AK-47 రైఫిల్స్,  4 SLR, 2 INSAS రైఫిల్స్, 6 .303 రైఫిల్స్, 2 సింగిల్ షాట్ రైఫిల్స్,  1 BGL (Barrel Grenade Launcher)

వీరి పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తాం. త్వరలో వివరాలు ప్రకటిస్తాం అని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్‌రాజ్ తెలిపారు. వరుస లొంగుబాట్లు.. పార్టీపై భారీ దెబ్బ.. గత కొన్ని వారాలుగా మావోయిస్టుల లొంగుబాట్లు వేగం పుంజుకున్నాయి.

Advertisement

Also Read: కొండా సుస్మిత వ్యాఖ్యలు.. పార్టీ నేతలకు మహేశ్ కుమార్ హెచ్చరిక

అక్టోబర్ 17న బస్తర్ జిల్లా జగదల్‌పూర్లో కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ (ఆశన్న)తో సహా.. 210 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. వీరు 153 ఆయుధాలు అప్పగించారు. అక్టోబర్ 2 బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్‌రావు నేతృత్వంలో 61 మంది సరెండర్ అయ్యారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×