E-Paper
Advertisement

Maoist Party: మల్లోజుల లొంగుబాటుపై మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ

Maoist Party: మల్లోజుల లొంగుబాటుపై మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ
Advertisement

Maoist Party: వరుస లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల లొంగిపోయిన పోలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను మరియు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ సతీశ్లను విప్లవ ద్రోహులుగా.. పార్టీ విచ్ఛిన్నకారులుగా అభివర్ణిస్తూ వారిని.. వారి అనుచరులను పార్టీ నుంచి బహిష్కరించింది.

కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదల చేసిన లేఖలో, మల్లోజుల, ఆశన్న ముఠా కేంద్ర కమిటీతో చర్చించకుండానే తమ అనుచరులతో లొంగిపోయారని ఆరోపించింది. వీరు పార్టీకి, ప్రజలకు చెందిన సుమారు 50 ఆయుధాలను శత్రువులకు అప్పగించడం విప్లవ ద్రోహమేనని మండిపడింది.

Advertisement

2011 చివరి నుండి విప్లవోద్యమం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండగా, 2025 మేలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత మల్లోజులలోని బలహీనతలు బహిర్గతమయ్యాయని లేఖలో పేర్కొన్నారు. మల్లోజుల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు కొనసాగిస్తూ కోవర్టుగా మారారని ఆరోపించారు. సతీశ్ కూడా ఛత్తీస్‌గఢ్ పోలీసు మంత్రితో సంబంధాలు పెట్టుకున్నారని పేర్కొన్నారు.

ALSO READ: Sleeping without pillow: దిండు లేకుండా నిద్రపోతే శరీరానికి జరిగే అద్భుత మార్పులు ! తెలుసుకుంటే ఇకపై దిండు వేసుకోరేమో!

Advertisement

లొంగిపోయిన మల్లోజుల, ఆశన్న ముఠాను “తన్ని తరమాలని” విప్లవ ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రాణభీతితో లొంగిపోవాలనుకునేవారు లొంగిపోవచ్చు కానీ, ఆయుధాలను శత్రువులకు అప్పగించకూడదని హెచ్చరించింది. ఈ లొంగుబాట్ల వల్ల విప్లవోద్యమానికి నష్టం తాత్కాలికమేనని, పార్టీ శత్రువుకు లొంగిపోదని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.

ALSO READ: RRC JOBS: ఇండియన్ రైల్వే నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు, డోంట్ మిస్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×