E-Paper
Advertisement

Manish Sisodia: హైకోర్టుకు వెళ్లండి.. మనీశ్ సిసోడియాకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..

Manish Sisodia: హైకోర్టుకు వెళ్లండి.. మనీశ్ సిసోడియాకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..
Advertisement

Manish Sisodia: ఢిల్లి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాను ఆదివారం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సీబీఐ ఛార్జ్‌షీట్‌లో మనిశ్ సిసోడియా పేరు లేకున్నా అక్రమంగా అరెస్ట్ చేశారని సిసోడియా తరుపున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు సీబీఐ అరెస్టును సవాల్ చేయాలనుకుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలి సూచించింది.

Advertisement

ఆదివారం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సిసోడియాను ఐదురోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ఢిల్లీ కోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది. సిసోడియా కస్టడీపై ఢిల్లీ కోర్టు కొన్ని షరతులు విధించింది. ఐదురోజుల కస్టడీలో సిసోడియాను విచారించే చోట సీసీటీవీ ఉండాలని స్పష్టం చేసింది. ఆ ఫుటేజ్‌ను సీబీఐ భద్రపరచాలని ఆదేశాలిచ్చింది. సిసోడియాకు 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఒక అరగంటపాటు తన తరఫు న్యాయవాదులను కలుసుకునే అవకాశం కల్పించాలని సూచించింది.

వారిమధ్య జరిగే సంభాషణను దర్యాప్తు సంస్థ అధికారులు వినకూడదని స్పష్టం చేసింది. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు ఆయన సతీమణితో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వైద్యులు సూచించిన మందులు వేసుకునేందుకు సిసోడియాకు పర్మిషన్ ఇవ్వాలని సూచించింది. అయితే తన అరెస్ట్‌ను, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తున్న తీరును సవాల్ చేస్తూ మనీశ్ సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×