E-Paper
Advertisement

Manipur Fresh Violence: మణిపూర్‌లో దారుణం, పంజా విసిరిన మిలిటెంట్లు

Manipur Fresh Violence: మణిపూర్‌లో దారుణం, పంజా విసిరిన మిలిటెంట్లు
Advertisement

Manipur fresh violance news(Telugu breaking news): మణిపూర్‌లో కుకి మిలిటెంట్లు మళ్లీ విరిచుకుపడ్డారు. శనివారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై కొందరు మిలిటెంట్లు దాడికి దిగారు. అకస్మాత్తుగా కాల్పులు జరుపుతూ బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు.

మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. మిలిటెంట్ల ఆచూకీ కోసం కూంబింగ్ మొదలుపెట్టారు. 128 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ సబ్‌ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ ఈ దాడిలో మరణించినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

సీఆర్పీఎఫ్ క్యాంప్ టార్గెట్‌గా కుకి మిలిటెంట్లు కొండపై నుంచి విచక్షణా రహితంగా కాల్పులకు దిగారు. మరోవైపు దాడికి తెగబడిన మిలిటెంట్ల ఏరివేతకు భారీగా కూంబింగ్ మొదలుపెట్టినట్లు తెలిపారు. దీంతో అలర్టయిన సీఆర్పీఎఫ్ బలగాలు సమీపంలోని ప్రదేశాలను జల్లెడ పట్టారు.

ALSO READ: రేసుగుర్రం విలన్‌ రవికి రిలీఫ్, డీఎన్ఏ టెస్టుకు కోర్టు నో

Advertisement

గతేడాది మే చివరలో మణిపూర్‌లోని ఇంఫాల్ వ్యాలీలో మైతి-కూకీ తెగల మధ్య దాడులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 200 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గ్రామ రక్షణ దళాలుగా తమని తాపు పిలుచుకునే ఈ మిలిటెంట్లు స్వీయ రక్షణ పేరిట హింసకు తెగబడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదిలావుండగా పోయినవారం జాతీయ రహదారిపై హింస రేగింది. రెండు కమ్యూనిటీల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×