E-Paper
Advertisement

Man Kills Leopard: చిరుతతో అరగంటపాటు ఫైటింగ్.. తండ్రీ కొడుకు సేఫ్, పెద్దాయన ధైర్యానికి హ్యాట్సాఫ్

Man Kills Leopard: చిరుతతో అరగంటపాటు ఫైటింగ్.. తండ్రీ కొడుకు సేఫ్, పెద్దాయన ధైర్యానికి హ్యాట్సాఫ్
Advertisement

Man Kills Leopard: ఆ మధ్య తెలుగులో ‘మన్నెంపులి’ సినిమా వచ్చింది. పులితో మోహన్‌లాల్ సన్నివేశాలు చిత్రీకరణ సినిమాకి హైలైట్. రియల్ లైఫ్‌లో అదే చేశాడు 60 ఏళ్ల పెద్దాయన. చిరుత దాడి నుంచి తనతోపాటు కొడుకుని రక్షించుకోవడానికి ఈటెతో పొడిచి చంపిన ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది. ఇంకాస్త లోతుగా స్టోరీలోకి వెళ్తే..

గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా ఘటన

Advertisement

గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా ఉనా ప్రాంతానికి చెందిన బాబుభాయ్ నరన్‌బాయ్. అతడి వయస్సు దాదాపు 60 ఏళ్లు పైమాటే. బుధవారం సాయంత్రం వేళ ఇంటి ముందు షెడ్‌లో నిద్రపోవడానికి రెడీ అయ్యాడు. లైట్‌గా చీకటి కూడా పడుతోంది. ఇంటి వెనుక నుంచి వచ్చిన ఓ చిరుతపులి అతడిపై దాడి చేసింది. దీంతో అతడు గట్టిగా కేకలు వేశాడు.

కేకలు విన్న బాబుభాయ్ కొడుకు శార్దూల్ ఇంట్లో నుంచి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. యువకుడ్ని చూసిన ఆ చిరుత తండ్రిని వదిలి శార్దూల్‌‌పైకి జంప్ చేసి చేతిని కొరికింది. కొడుకుని రక్షించుకోడానికి బాబుభాయ్ తన ధైర్యాన్ని కూడదీసుకున్నాడు. పక్కనే ఉన్న కొడవలి, ఈటెతో చిరుతపై దాడి చేశాడు. చిరుతను చంపేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నాకావు.

Advertisement

తనతోపాటు కొడుకుని రక్షించేందుకు చిరుతను చంపిన పెద్దాయన

దాదాపు అరగంటపాటు తర్వాత ఈటెతో చిరుతను పొడిచి చంపేశాడు. కొడుకుని కాపాడుకున్నాడు. ఈ ఘటనలో తండ్రీ-కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు.ఘనత తర్వాత తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది.

దీనిపై పెద్దాయన మీడియాతో మాట్లాడాడు. తాను రాత్రి షెడ్‌లో నిద్రపోతున్న సమయానికి చిరుత వచ్చిందన్నాడు. తాను కేకలు పెట్టగానే నా వైపునకు వచ్చి దాడి చేసిందన్నాడు.గట్టిగా కేకలు వేయడంతో గొంతు పట్టుకుందన్నాడు. అరుపులకు విని కొడుకు పరుగెత్తుకుని వచ్చాడని, తనను వదలి చిరుతపులి కొడుకుపై దాడి చేసిందన్నాడు. కొడుకును రక్షించడానికి ప్రయత్నించడంతో మళ్లీ తనపై దాడి చేసిందన్నాడు.

ALSO READ: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ దొరికింది! త్వరలోనే అసలు నిజాలు బయటకి? 

చివరకు కొడవలి, ఈటెలతో కలిసి చిరుతను చంపినట్టు చెప్పాడు. ఈ ఘటన తర్వాత అటవీ శాఖకు సమాచారం ఇచ్చానని తెలిపాడు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు, చిరుత శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. తాను ఉపయోగించిన కొడవలి, ఈటెలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించాడు. జంతువుని చంపినందుకు తండ్రీ కొడుకులపై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×