E-Paper
Advertisement

Surat man falls from 10th floor: మృత్యువుతో పోరాడి గెలిచాడు.. 10వ అంతస్తు నుంచి జారిపడినా ప్రాణాలతో బయటపడ్డ వైనం

Surat man falls from 10th floor: మృత్యువుతో పోరాడి గెలిచాడు.. 10వ అంతస్తు నుంచి జారిపడినా ప్రాణాలతో బయటపడ్డ వైనం
Advertisement

Surat man falls from 10th floor : విధి రాత బాగుంటే మృత్యువు కూడా ఓడిపోతుంది అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. గుజరాత్‌లోని సూరత్‌లో ఒక వ్యక్తి ఏకంగా 10వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడినా, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. సినిమా రేంజ్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

సూరత్‌కు చెందిన 57 ఏళ్ల నితిన్‌ అదియా ఓ ఎత్తైన అపార్ట్‌మెంట్‌లో 10వ అంతస్తులో నివసిస్తున్నారు. ఎప్పటిలాగే ఆయన తన ఫ్లాట్‌లోని కిటీకీ పక్కన నిద్రిస్తున్నారు. అయితే, నిద్ర మత్తులో ఆయన కిటికీ వైపు దొర్లడంతో ప్రమాదవశాత్తు కిందకు జారిపోయారు. 10వ అంతస్తు నుండి ఒక్కసారిగా కిందకు పడిపోతున్న సమయంలో, అనూహ్యంగా 8వ అంతస్తులోని కిటికీ గ్రిల్స్‌లో ఆయన కాలు బలంగా ఇరుక్కుపోయింది.

Advertisement

దీంతో ఆయన 8వ అంతస్తు గ్రిల్స్‌కు తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయారు. ప్రాణభయంతో ఆయన చేసిన ఆర్తనాదాలు విన్న స్థానికులు, అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది హైడ్రాలిక్ క్రేన్ సాయంతో అత్యంత శ్రమించి ఆయన్ను రక్షించారు. గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న కాలును జాగ్రత్తగా వెలికితీసి, ఆయన్ను క్షేమంగా కిందకు దించారు.

ఈ ప్రమాదంలో నితిన్ కాలుకు, శరీరానికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 10వ అంతస్తు నుంచి పడినా, కేవలం కాలు ఇరుక్కోవడం వల్ల ఆయన బతికిపోవడం నిజంగా అద్భుతమని, ఆయన మృత్యుంజయుడని స్థానికులు చర్చించుకుంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తిని అందరూ కొనియాడారు. ఎత్తైన భవనాల్లో నివసించేవారు కిటికీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా నిద్రించేటప్పుడు కిటికీలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Read Also: Pune Municipal Elections: మాకు ఓటేస్తే థాయ్‌లాండ్‌ ట్రిప్, కారు ఫ్రీ! పుణె ఎన్నికల్లో ‘తాయిలాల’ జాతర

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×