E-Paper
Advertisement

Rajasthan: మామతో కోడలు జంప్.. షాక్‌లో భర్త

Rajasthan: మామతో కోడలు జంప్.. షాక్‌లో భర్త
Advertisement

Rajasthan: ప్రేమ అంటే.. రెండు మనుసులు కలవడం.. ఇద్దరు మనుషులు ఏకమవ్వడం.. ఒకరి కష్టసుఖాలను మరొకరు పంచుకోవడం. కానీ కొందరు మాత్రం వావివరసలు లేకుండా ప్రేమించుకుంటున్నారు. ఛెండాలంగా వ్యవహరిస్తున్నారు. ఇలానే రాజస్థాన్‌లో ఓ వ్యక్తి తన కొడుకు భార్యతో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా భర్తకు తెలియకుండా మామతో రాసలీలలు జరిపింది. ఆ తర్వాత ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు.

బుండీ జిల్లా సిలార్‌కు చెందిన రమేశ్ వైరాగీకి ఒక కొడుకున్నాడు. అతని పేరు పవన్ వైరాగీ. రెండేళ్ల క్రితం పవన్‌కు పెళ్లి కాగా.. ఇటీవలే చిన్న పాప జన్మించింది. ఇక పవన్ పని కోసం రోజూ ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే వాడు. ఈక్రమంలో రమేశ్ వైరాగీకి కోడలికి మధ్య ప్రేమ చిగురించింది. కొద్దిరోజుల పాటు ఇద్దరూ పవన్‌కు తెలియకుండా రాసలీలలు సాగించారు. చాలా రోజుల పాటు ఈ విషయం పవన్‌కు తెలియకుండా మ్యానేజ్ చేశారు.

Advertisement

ఇటీవల వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. పవన్ పనికి వెళ్లి వచ్చి చూసే సరికి ఇంట్లో లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించాడు. అయినా కూడా వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి రమేశ్, భార్య ఇద్దరూ కలిసి లేచిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తన భార్య ఉట్టి అమాయకురాలని, తన తండ్రే మాయమాటలు చేసి ఆమెను తీసుకెళ్లాడని వెల్లడించాడు.

అంతేకాకుండా తన బైక్‌ను కూడా దొంగిలించాడని పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరి కోసం గాలిస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×