E-Paper
Advertisement

Speed Electric Bikes : లో స్పీడ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

Speed Electric Bikes : లో స్పీడ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల
Advertisement

Speed Electric Bikes : భారతదేశంలో మిరాకిల్ జిఆర్, డెక్స్ జిఆర్ పేర్లతో రెండు లో స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ల్ని విడుదల చేసింది…. యులు సంస్థ. అయితే ఈ రెండు స్కూటర్లను… బజాజ్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే చేతక్ టెక్నాలజీస్ లిమిడెట్ తయారు చేయడం విశేషం. ఈ రెండు స్కూటర్లు గరిష్ట వేగం 25 కిలోమీటర్లు. ఇంటి నుంచి చిన్న చిన్న అవసరాలకు బయటకు వెళ్లేవారి కోసం మిరాకిల్ జీఆర్‌ను… వస్తువులు, ఫుడ్ డెలివరీ చేసేవారికి ఉపయోగపడేలా డెక్స్ జీఆర్‌ను తీర్చిదిద్దారు.

మిరాకిల్ జిఆర్, డెక్స్ జిఆర్ స్కూటర్ల ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. రెండింటికీ ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ మాత్రమే ఇచ్చారు. ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ ల్యాంప్, సెంటర్ స్టాండ్, ఫుట్ పెగ్‌లతో కూడిన ఫ్లోర్‌బోర్డ్ రెండు స్కూటర్లలో అమర్చారు. డెలివరీ కోసం రూపొందించిన డెక్స్ జీఆర్ వెనుక భాగంలో 15 కిలోల పేలోడ్ కెపాసిటీ కలిగిన బాక్స్ కూడా అమర్చారు. అయితే ఈ రెండు స్కూటర్ల బ్యాటరీ కెపాసిటీ ఎంత? ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? అనే వివరాలను యులు ఇంకా ప్రకటించలేదు.

Advertisement

అయితే… మిరాకిల్ జిఆర్, డెక్స్ జిఆర్ స్కూటర్లను స్వాపింగ్ బ్యాటరీతో తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చిన యులు… 2024 చివరి నాటికి వాటి సంఖ్యను 500లకు పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం డెక్స్ ఎన్‌వి, మిరాకిల్ సిటీ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోన్న యులు… అద్దె సేవలు కూడా అందిస్తోంది. యులు ఎలక్ట్రిక్ బైక్‌లు వాడాలని అనుకునే వారు యాప్ ద్వారా బుక్ చేసుకుని అద్దెకు తీసుకోవచ్చు. తిరిగే కిలోమీటర్లు, వినియోగించే సమయం ఆధారంగా చెల్లింపులు చేయవచ్చు. అయితే అద్దె సేవలు ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిని మరిన్ని నగరాలకు విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×