E-Paper
Advertisement

Indigo CEO Resign: ఇండిగో సీఈవో ఎల్బర్స్ రాజీనామా.. కారణం అదేనా?

Indigo CEO Resign: ఇండిగో సీఈవో ఎల్బర్స్ రాజీనామా.. కారణం అదేనా?
Advertisement

Indigo CEO Resign: ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ కంపెనీ మంగళవారం అధికారక ప్రకటన విడుదల చేసింది. ఇండిగో ఎండీ రాహుల్ భాటియా తాత్కాలిక సీఈవోగా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 2022లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎల్బర్స్.. తాజాగా పదవీకాలం ముగియడంతో రాజీనామా చేశారు. ఇటీవల వందలాది విమానాలకు అంతరాయం, లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన నెలల సమయంలోనే ఎల్బర్స్ సీఈవోగా రాజీనామా చేశారు.

మార్చి 10 నాటికి ఎల్బర్స్ అగ్రిమెంట్ ముగియడంతో.. ఆయన ఇండిగో నించి రిలీవ్ అవుతున్నారు. రాహుల్ భాటియా, మేనేజింగ్ డైరెక్టర్, తాత్కాలికంగా కంపెనీ వ్యవహారాను చూసుకుంటారని ఇండిగో పేర్కొంది. నోటీసు పీరియడ్ చేయాల్సిన అవసరంలేకుండా ఎల్బర్స్ కు ఉపశమనం లభించింది. ఇండిగోలో తన పదవీకాలంలో ఎల్బర్స్.. జీతం, బోనస్‌లు, స్టాక్ మార్కెట్ ప్రోత్సాహకాలను కలిగి ప్యాకేజీగా అందుకున్నారు.

ఎల్బర్స్ వార్షిక జీతం?

Advertisement

వివిధ నివేదికల ప్రకారం , ఇండిగో ఎయిర్‌లైన్‌లో ఎల్బర్స్ వార్షిక జీతం దాదాపు రూ. 5 కోట్లు. అయితే, ప్రోత్సాహకాలు కలిపి మొత్తం ప్యాకేజీ భారీగా ఉంటుందని అంచనా. అలాగే నిబంధనలలో భాగంగా, ఎల్బర్స్‌కు 67,150 పనితీరు స్టాక్ యూనిట్లు మంజూరు చేశారు. మార్చి 2023లో మెచ్యూరిటీ సమయానికి వీటి విలువ దాదాపు రూ.12.52 కోట్లుగా ఉంది. ఎల్బర్స్ వేతనం, బోనస్‌లు కలుపుకుని దాదాపు రూ.17 కోట్లగా ఉంది. ఎల్బర్స్ నికర విలువను దాదాపు 5 మిలియన్ల యూఎస్ డాలర్లు. అంటే దాదాపు రూ. 45 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

ఇండిగో సంక్షోభం తరువాత

గత సంవత్సరం డిసెంబర్ లో ఇండిగో విమానాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఫైలట్లకు వారాంతపు సెలవుల నిబంధనలతో వేలాదిగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు అయ్యాయి. ఈ సంక్షోభంతో ఇండిపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడింది. సంక్షోభ సమయంలో ఇండిగో దాదాపు రూ. 2,000 కోట్ల నష్టాలను చూసింది. ఈ సంఘటన తర్వాత డీజీసీఏ ఇండిగోపై మొత్తం రూ.22.20 కోట్ల జరిమానాలు విధించింది. అదనపు నియంత్రణ చర్యలు తీసుకుంది. మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియాకు రాసిన తన రాజీనామా లేఖలో, ఎల్బర్స్ రాజీనామాకు వ్యక్తిగత కారణాలను చెప్పారు. తన నోటీసు పీరియడ్ ను రద్దు చేయాలని కోరారు. ఇండిగో సంస్థకు సీఈవోగా వ్యవహరించడం ఆనందంగా ఉందన్నారు.

Advertisement

Also Read: మినిమమ్ బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు.. టాప్ బ్యాంక్ ఇదే?

ఇండిగోలో చేరడానికి ముందు, ఎల్బర్స్ డచ్ ఎయిర్‌లైన్ KLM చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఇండిగోలో తన పదవీకాలం పూర్తి కాకముందే రాజీనామా చేశారు. కేఎల్ఎమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఇండిగో నాయకత్వం దాదాపు రూ. 11.9 కోట్ల విలువైన తెగతెంపుల ప్యాకేజీని అందుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×