E-Paper
Advertisement

Encounter: బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Encounter: బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
Advertisement

Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం వద్ద ఎస్ఎల్ఎర్, ఇన్సాస్ ఆయుధాలతో పాలు పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా అక్కడ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాల్పులు జరిగిన సంఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు నలుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. బీజాపూర్, గంగలూరు అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అక్కడ భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.

Advertisement

ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో 225 మంది మావోయిస్టులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. ఇందులో 208 మంది బీజాపూర్‌, బస్తర్‌, కాంకేర్‌, కొండగావ్‌, నారాయణపూర్‌, సుక్మా, దంతేవాడ జిల్లాల్లోని బస్తర్‌ డివిజన్‌లో ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు.  2026 మార్చ్‌ నాటికి మావోయిస్టులను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం జార్ఖండ రాష్ట్ర గామ్లా జిల్లాలోని ఘాగ్రా అటవీ ప్రాంతంలో కూడా ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.  పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడగా లొంగిపొమ్మని చెప్పినా వారు వినకుండా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ప్రాణ రక్షణ కోసం తాము ఎదురుకాల్పులకు సిద్ధపడినట్టు వారు చెప్పారు. తమవైపు నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసు అధికారులు వివరించారు.

Advertisement

ALSO READ: Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం.. భర్త స్పెర్మ్ కాకుండా మరొకరి శుక్రకణాలతో..?

ALSO READ: Akshara Devalla: చిన్న వయస్సులోనే అద్భుత ఘనత సాధించిన అక్షర దేవళ్ల

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×