E-Paper
Advertisement

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!
Advertisement

Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమృద్ధి మహామార్గ్‌పై వేగంగా వచ్చిన ఒక ఇథనాల్ కంటైనర్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కుకుని మొత్తం ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన వార్థా జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే?

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పూణే నుంచి కారులో ప్రయాణిస్తూ వస్తున్నారు. వార్థా జిల్లా గుండా వెళ్లే సమృద్ధి మహామార్గ్‌పైకి రాగానే, వారి కారును ఒక ఇథనాల్ కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఇథనాల్ అత్యంత ప్రమాదకరమైన, త్వరగా మంటలు అంటుకునే రసాయనం కావడంతో, ఢీకొట్టిన మరుక్షణమే భారీగా నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. క్షణాల వ్యవధిలోనే కంటైనర్‌తో పాటు కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది.

ఆరుగురు సజీవ దహనం

Advertisement

ప్రమాదం జరిగిన తీవ్రతకు కారులో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. అటు కంటైనర్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మంటల్లో చిక్కుకుపోయారు. అలా మొత్తం ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. వాహనాలు పూర్తిగా అస్థిపంజరాలుగా మారిపోయాయి.

విచారణ జరుపుతున్న పోలీసులు

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూణే నుంచి వస్తున్న ఆ కుటుంబంలో ఈ విషాదం నింపడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

Also Read: తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×