E-Paper
Advertisement

టీవీకే అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట

టీవీకే అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట
Advertisement

Vijay election affidavit case: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. విజయ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో భార్యకు రూ.12.60 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు పేర్కొనడంపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పెరంబూర్ నియోజకవర్గానికి చెందిన ఓటరు వెంకటేష్ దాఖలు చేసిన ఈ కేసుపై కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.

విజయ్ తన భార్య సంగీత విజయ్ నుండి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో నామినేషన్ పత్రాలలో ఆమెకు రూ.12.60 కోట్లు అప్పుగా ఇచ్చానని ప్రకటించడం అనుమానాస్పదంగా ఉందని ఆయన ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు వెల్లడించడం కేవలం లాంఛనం కాదని వివరించారు. నిజాలను దాచిపెట్టడం ఎన్నికల ప్రక్రియను మోసం చేయడమే అవుతుందని వాదించారు. ఒక ప్రైవేట్ విద్యా ట్రస్ట్‌కు ఇచ్చిన రూ.20 కోట్ల విషయంలో సైతం అఫిడవిట్‌లో సరైన వివరణ ఇవ్వలేదని వెంకటేష్ ఆరోపణలు చేశారు.

Advertisement

ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి ఎస్. ఎ. ధర్మాధికారి జస్టిస్ జి. అరుళ్మురుగన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో ఇదే తరహా ఉపశమనం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తాము ఇదివరకే కొట్టివేసినట్లు కోర్టు గుర్తు చేసింది. ఆ కారణం చేత ప్రస్తుత కేసును విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కోర్టు తీర్పుతో విజయ్ ఎన్నికల అఫిడవిట్ చుట్టూ నెలకొన్న వివాదానికి ప్రస్తుతానికి తెరపడింది.

Read Also: పెట్రోల్ కోసం కిలోమీటర్ల క్యూలు.. విహారయాత్రల్లో లోకేష్.. వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×