LPG Cylinder Price Reduced: ఎట్టకేలకు జూలై ఒకటి నుంచి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా మరొక శుభవార్త. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను భారీగా తగ్గింది. తగ్గించిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్
పశ్చిమాసియాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో మాదిరిగా హోర్మూజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకలు రాకపోకలు మొదలయ్యాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
దేశంలో గ్యాస్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. జులై ఒకటి నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ. 183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి గ్యాస్ కంపెనీలు. మార్చి తర్వాత కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర భారీగా తగ్గింపు, నేటి నుంచి అమల్లోకి
కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ధర తగ్గింపుతో బ్రేక్ పడిందని చెప్పవచ్చు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల ఇంకా తగ్గవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మే నెలలో కమర్షియల్ సిలిండర్ రూ. 993 పెరిగింది. జూన్ ఒకటిన మరో రూ. 42 పెరగడంతో దీని ధర రూ. 3,113.50 లకు చేరింది.
తాజాగా ధర తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,930కి చేరింది. కోల్‌కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ. 3,255.50 నుండి రూ. 3,081.50 లకు తగ్గింది. కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. గతంలో సిలిండర్ల ధర పెరిగినట్టు రేట్లు అమాంతంగా పెంచేశాయి.
ALSO READ: కేతన్ మర్డర్ ఎఫెక్ట్.. లోహగఢ్‌కు పోటెత్తిన పర్యాటకులు.. క్రైమ్ స్పాటే టార్గెట్!
మరి ఇప్పుడు ఆయా ధరలు తగ్గిస్తాయా? అన్నదే సామాన్యుడి ప్రశ్న. గృహ వినియోగ సిలిండర్ ధర మార్పు లేదు. రూ. 942 ధర యథాతధంగా కొనసాగుతోంది. గృహ వినియోగదారులు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల ధరలు ఏడాది తర్వాత మార్చి 7న రూ. 60 పెంచాయి గ్యాస్ కంపెనీలు. జూన్ 7న మరో రూ. 29 పెంచాయి.