E-Paper
Advertisement

LPG Cylinder Booking: ఎల్పీజీ గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయం.. బుకింగ్ గడువు 25 రోజులకు పెంపు

LPG Cylinder Booking: ఎల్పీజీ గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయం.. బుకింగ్ గడువు 25 రోజులకు పెంపు
Advertisement

LPG Cylinder Booking: మిడిల్ ఈస్ట్ లో యుద్ధంతో.. దేశీయ గ్యాస్ ధరలు పెరిగే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఇటీవల గ్యాస్ సిలిండ్ ధరను రూ.60 పెంచాయి కంపెనీలు. దీంతో వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్ భారీగా పెరిగింది. దీంతో కేంద్రం ప్రభుత్వం.. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 నుంచి 25 రోజులకు పెంచింది. గతంలో 55 రోజులకు ఎల్‌పీజీ సిలిండర్లను బుక్ చేసుకునే వ్యక్తులు తాజాగా 15 రోజుల్లో సిలిండర్లను బుక్ చేసుకోవడం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎల్పీజీ ఉత్పత్తి పెంచండి

కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. కమర్షియల్ కనెక్షన్ల కంటే వంట గ్యాస్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిది. అలాగే ప్రభుత్వం మరిన్ని ఎల్పీజీ సరఫరా దేశాల కోసం వెతుకుతుంది. అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాల నుంచి ఎల్పీజీని విక్రయించడానికి ముందుకు వచ్చాయని అధికారులు తెలిపారు.

బ్యారెల్ కు 130 డాలర్లు?

Advertisement

ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 130 డాలర్లకు చేరుకునే వరకు భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భారతదేశంలో తగినంత నిల్వ ఉన్నందున ఇంధన ధరలు పెరిగే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల వద్ద స్థిరీకరణ చెందుతాయని తెలిపాయి. దేశంలోని ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని పేర్కొన్నాయి.

Also Read:  సామాన్యులకు భారీ ఊరట.. వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

Advertisement

హార్ముజ్ జలసంధి నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా ముడి చమురు రవాణా వేగవంతం చేసినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో తగినంత ఏవియేషన్ టర్బైన్ ఇంధనం నిల్వ ఉందని పేర్కొంది. ఏటీఎఫ్ ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×