E-Paper
Advertisement

LPG Crunch: ఎల్‌పీజీ గ్యాస్ ఫియర్.. ఆనాడు ఏటీఎంలు.. నేడు గ్యాస్ ఏజెన్సీల వద్ద ఇదే పరిస్థితి

LPG Crunch: ఎల్‌పీజీ గ్యాస్ ఫియర్.. ఆనాడు ఏటీఎంలు.. నేడు గ్యాస్ ఏజెన్సీల వద్ద ఇదే పరిస్థితి
Advertisement

LPG Crunch: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. అయితే బుధవారం సాయంత్రం క్రూడాయిల్‌తో వస్తున్న ఓ షిప్‌ను పేల్చేశారు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఈ వార్త దావానంలా వ్యాపించింది. నగరాల నుంచి గ్రామాల వరకు చేరిపోయింది. ఫలితంగా గ్యాస్ కోసం వినియోగదారులు ఆయా ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు గ్యాస్ ఏజెన్సీలోకి చొరబడి గ్యాస్ సిలిండర్లను ఎత్తుపోయారు. దీనికి సంబందించి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

ఎల్‌పీజీ గ్యాస్ కొరత భయాలు.. గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరిన కస్టమర్లు

Advertisement

దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత వెంటాడుతోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలు తెలుస్తున్నాయి. ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా, ప్రజలకు ఏ మాత్రం నమ్మకం కలగలేదు. దీంతో గ్యాస్ వినియోగదారుల్లో భయాలు నెలకొన్నాయి. ఫలితంగా గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్న సందర్భాలు ఇండియాలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. పట్టణ, రూరల్ ప్రాంతాల్లో ఈ భయం మరింత ఎక్కువైంది. గ్యాస్ తోడు ఆయిల్ కూడా కొరత వేధిస్తే ఏజెన్సీలకు చెందిన వాహనాలు రాకపోతే కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బస్తి జిల్లా మహాదేవ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఊహించని పరిస్థితి నెలకొంది. వంట గ్యాస్ కొరత ఉందనే వార్తల నడుమ మహాదేవ గ్యాస్ ఏజెన్సీ వద్దకు LPG సిలిండర్లను పొందడానికి డజన్ల కొద్దీ ప్రజలు పరుగెత్తుతున్న దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ పంపిణీ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో జనం తోసుకుంటూ కనిపించింది. చాలా మంది వ్యక్తులు తమ భుజాలపై గ్యాస్ సిలిండర్లను భుజంపై పెట్టుకుని వేగంగా పరుగెత్తుతున్నారు. దీనికి సంబంధించి 15 సెకన్ల నిడివి గల వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Advertisement

యూపీలోని బస్తి జిల్లా మహాదేవ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఊహించని పరిస్థితి

దేశంలో ఎల్‌పీజీ కొరత లేదని అధికారులు పదే పదే చెబుతున్నారు. ఇంధన సరఫరా స్థిరంగా ఉందని ఎలాంటి అంతరాయం లేదని భారత కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ స్వయంగా చెప్పారు. దేశంలో తగినంత నిల్వలు ఉన్నాయని, పంపిణీ నెట్‌వర్క్‌లు పూర్తిగా పని చేస్తున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు.

అధికారిక హామీలు ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోని గ్యాస్ ఏజెన్సీల నుండి వచ్చిన దృశ్యాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆనాడు ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరేవారు. ఏటీఎంల్లో క్యాష్ అయిపోతుందని వేకువజాము నుంచే బ్యాంకు ఏటీఎంల వద్ద నిరీక్షించేవారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల వంతైందని అంటున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడిందని కొందరు అంటున్నారు.

ALSO READ: మాజీ సీఎం ఫరూక్‌పై కాల్పులు.. అలర్టయిన పోలీసులు, నిందితుడు అరెస్ట్

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×