E-Paper
Advertisement

Lok Sabha polls : మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారం షురూ.. ఎక్కడి నుంచో తెలుసా?

Lok Sabha polls : జనవరి 13 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా ముమ్మరంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నాయి.

Lok Sabha polls : మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారం షురూ.. ఎక్కడి నుంచో తెలుసా?
Advertisement

Lok Sabha polls : జనవరి 13 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా ముమ్మరంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలోనే జనవరి 13 న బెతియా సిటీలోని రామ్ మైదాన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. బిహార్‌లోని చంపారన్ లో జరగనున్న బహిరంగ సభతో దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Advertisement

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని 40 స్థానాల్లో గెలుపు కోసం బీజేపీ విస్తృత ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా బహిరంగ సభలతో ముమ్మర ప్రచారం చేపట్టనుంది. జనవరి 13న రాష్ట్ర పర్యటనతోనే ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని బేగూసరాయ్‌, బెతియా, ఔరంగాబాద్‌లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు కూడా వచ్చే రెండు నెలల్లో బిహార్‌లో అనేక సభల్లో పాల్గొననున్నారు. జనవరి 15 తర్వాత ముమ్మర ప్రచారం ఉండనున్నట్లు సమాచారం. సీతామర్హి, మధేపురా, నలందాల్లో అమిత్‌షా పాల్గొననుండగా.. సీమాంచల్‌లో జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే, కేంద్రంలో బీజేపీను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీ కూటమి I.N.D.I.A(ఇండియా)లో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రేసులోనూ నీతీశ్‌ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×