E-Paper
Advertisement

Snow Festival : మంచు శిల్పాల మాయాలోకం

Snow Festival : మంచు శిల్పాల మాయాలోకం
Advertisement
snow festival

Snow Festival : అదో మాయాలోకం.. ఎటు చూసినా మంచు శిల్పాలే. పిల్లలు, పెద్దల సందడి నడుమ ఐస్ అండ్ స్నో ఫెస్టివల్ ఆరంభమైంది. చైనా హేలాంగ్‌ఝాంగ్ ప్రావిన్స్ రాజధాని హర్బిన్‌లో ఏటా శీతాకాలంలో జరిగే పండుగ ఇది. ఫెయిరీ టేల్‌లో మాదిరిగా కళ్ల చెదిరే మంచు రాజకోటలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఏడాది 8.1 లక్షల చదరపు మీటర్లలో ఐస్ పార్క్‌ ఏర్పాటైంది. 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల మంచుతో శిల్పాలను రూపొందించారు. సమీపంలోని సోంగ్వా నది ఘనీభవించడంతో.. అక్కడి నుంచి మంచుగడ్డలను తీసుకొచ్చి వీటిని తయారు చేశారు. చీకటి పడితే చాలు.. రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులో మంచు శిల్పాలు ఎంతో అందంగా మెరిసిపోతున్నాయి.

Advertisement

చైనా సంస్కృతిని ప్రతిబింబించే భవనాలు, బ్రిడ్జిలు, ఫెయిరీ టేల్ కేజిల్స్‌, బుద్ధుడి భారీ ప్రతిమ టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పార్కులో పిల్లల కోసం మంచుతోనే జారుడు బల్లలు ఏర్పాటు చేయడం విశేషం. ప్రతి రోజూ 30 వేల మందిని స్నో పార్క్‌ను సందర్శిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×